జయలలిత ని కాకా పట్టడానికేనా ఇదంతా

Jaya Lalitha Birthday Celebrations

04:25 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Jaya Lalitha Birthday Celebrations

తమిళనాడులో ఈరోజు పలుచోట్ల మామూలు జల్లులు కాదు ... వరాల జల్లు కురుస్తోంది. బుధవారం పుట్టిన బాలికలకు ఓ చోట రూ.10,000 ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఆఫర్ ఇస్తుంటే , మరో చోట బంగారం ఉంగరాలు.. కానుకలుగా అందిస్తుంటే , ఇంకో చోట ఎవరైనా సరే అమ్మ క్యాంటీన్‌లో ఉచిత భోజనం .. ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా? ఇంకేమిటి తమిళనాడు అనగానే పురుచ్చి తలైవి , ముఖ్యమంత్రి జయలలిత గుర్తొస్తారు. ఫిబ్రవరి 24 బుధవారం ఆమె 68వ జన్మదినం. మామూలుగానే ఆమె అభిమానులు , అమ్మ భక్తులు చేసే హడావిడి అంతాఇంతా కాదు ఇక పుట్టినరోజు కావడంతో , పైగా ఎన్నికల వేళ అవ్వడంతో ఆమె పుట్టినరోజు వేడుకలు హోరెత్తి పోయాయి. వీధి వీధినా అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. జయలలిత జన్మదినం సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ఉన్న మొత్తం 122 దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. అన్నా డీఎంకే పార్టీ కార్యాలయంలో ఈ ఉదయం ఏకంగా 68 కిలోల బరువున్న భారీ కేకును పార్టీ నేతలు, కార్యకర్తలు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఉత్తర చెన్నైలో బుధవారం పుట్టిన పాపాయిలందరికీ బంగారు ఉంగరాలు బహూకరిస్తామని అన్నా డీఎంకే నేత జయకుమార్‌ ప్రకటించారు. అమ్మకు 68 ఏళ్లు వస్తున్న సందర్భంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 68 లక్షల మొక్కలు నాటేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. అమ్మ క్యాంటీన్లలో బుధవారం ఉచిత ఆహారం పంపిణీ చేసేందుకు చెన్నై మేయర్‌ దురైసామి డబ్బులు చెల్లించారు. చైన్నై సిటీ కార్పొరేషన్‌ కింద నడుస్తున్న ఆసుపత్రుల్లో పుట్టిన ఆడ పిల్లలందరికీ రూ.10,000 చొప్పున డిపాజిట్‌ చేస్తామని ఆ కార్పొరేషన్‌ ప్రకటించింది.

ఇక ఈ వేడుకల హంగామాపై డీఎంకే సహా ప్రతిపక్ష పార్టీలు అన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాగే ఆమె పుట్టినరోజు సందర్భంగా వార్తాపత్రికలు, టెలివిజన్‌ ఛానళ్లలో పెద్ద ఎత్తున ప్రకటనలు వేయడం పట్ల వారు విమర్శల జడివాన కురిపిస్తున్నారు.

English summary

ll India Anna Dravida Munnetra Kazhagam (AIADMK) party president Tamilnadu Chief Minister Jaya Lalita birthdays celebrations going on chennain in a grand manner.68 KGs of cake were cutted by her fans in Tamilnadu.