రెండు పత్రికలపై జయ దావా

Jaya Lalitha Files Case On Two News Papers

12:22 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Jaya Lalitha Files Case On Two News Papers

పురిచ్చి తలైవి గా పేరొందిన తమిళనాడు సిఎమ్ జయలలితకు కోపం కోపం వచ్చినా , సంతోషం కలిగినా పట్టడం కష్టమే. కోపం వస్తే అంతు చూడందే వదలని నైజం.తాజాగా రెండు పత్రికలు రాసిన రాతలు ఆమెకు ఆగ్రహం కల్గించాయి. అంతే వెంటనే కేసు వేసేసారు. వివరాల్లోకి వెళితే,

తమిళ దినపత్రిక దినమలర్, ఇంగ్లీష్ డైలీ టైమ్స్ ఆఫ్ ఇండియా ల మీద ఆమె పరువునష్టం దావా వేశారు. గత నెలలో చెన్నై ని వరద నీరు ముంచెత్తడానికి జయ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఈ పత్రికలు ఆరోపించాయి. అయితే అమ్మ ప్రభుత్వం దీన్ని ఖండించింది. వివరణ ఇచ్చినా కూడా దినమలర్, టైమ్స్ ఆఫ్ ఇండియా , సర్కార్ ని దుయ్యబడుతూ వార్తలు రాశాయని జయ ఆగ్రహం చెందారు. సిఎమ్ ఆదేశించడం, వెంటనే, నగర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ రెండు పత్రికలపై పరువు నష్టం దావా వేయడం చకచకా జరిగిపోయాయి.

ఇంతకీ ఈ రెండు పత్రికలు ఎం రాసాయంటే , చెంబరంబక్కం చెరువు స్లైస్ గేట్లు తెరచినందువల్లే నగరం వరద నీటి ముంపునకు గురైందని. అయితే ఈ చెరువు నుంచి అడయార్ నదికి నీటి విడుదలలో అధికారుల నిర్లక్ష్యమేమీ లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. నవంబరులోను, ఆ తరువాత కూడా భారీ వర్షాలు, వరదల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందే తప్ప ఇందులో బ్యూరో క్రటిక్ నెగ్లిజెన్స్ ఏమీ లేదని ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. అయినా ఈ రెండు పత్రికలు సర్కార్ ని దుమ్మెత్తి పోస్తున్నాయి.

English summary

Tamilnadu Cheif Minister files cases against two news papers on Tamilnadu court for passing fake information about her