డైరెక్టర్‌గా మారిన జయప్రద 

Jaya Prada turns as a director

01:51 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Jaya Prada turns as a director

తెలుగు, తమిళం, హింది, కన్నడ, మలయాళం, బెంగాలీ మరియు మరాఠీ వంటి అనేక భాషలలో అనేక చిత్రాలలో నటించి చిత్ర పరిశ్రమలలో ఒకప్పటి టాప్‌ హీరోయిన్‌ జయప్రద వెలుగొందింది . ఇప్పుడు జయప్రద దర్శకత్వ రంగంలో తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంటుంది. నటనతో, నైపుణ్యంతో , అందంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న జయప్రద తన కెరీర్‌ లో మెగా ఫోన్‌ను పట్టుకుంది. ఇటీవల ఆమె హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె బాలీవుడ్‌ చిత్రాలను తెలుగులో రిమేక్‌ చెయ్యడానికి కావలసిన రైట్స్‌ ను కొనాలనుకుంటున్నానని ప్రకటించింది. నటిగా తనను ఆదరించిన ప్రేక్షకులు దర్శకురాలిగా కూడా తనను ఆదరిస్తారని ఆశిస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం ఆమె 'ఇష్క్‌' అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది . ఈ చిత్రం అతి త్వరలో విడుదల కాబోతుంది.

English summary

Veteran heroine jayapradha turned as director. This news was said by jayapradha to media when she visit hyderabad . She said that she is going to remake hindi movies in telugu and now she is directing a movie in telugu and tamil named "Ishk"