నెరవేరిన జయ శపధం

Jayalalitha About Her Personal Life

12:11 PM ON 7th December, 2016 By Mirchi Vilas

Jayalalitha About Her Personal Life

ఓ ఆంగ్ల టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన జీవితం గురించి స్పష్టంగా వివరించారు. ‘‘మీ వ్యక్తిగత జీవితంలో అన్ని వైపుల నుంచి వదంతులు వస్తున్నాయి. వాటి గురించి చెప్పండి’’ అని జయను టీవీ హోస్ట్ ప్రశ్నించినపుడు ఆమె స్పందిస్తూ చాలా ఆత్మవిశ్వాసంతో ఓ మాట చెప్పారు ‘‘నా వ్యక్తిగత జీవితంలో నేను ఓడిపోయా. నా జీవితం ఓ తెరచిన పుస్తకం. ప్రతి ఒక్కరూ ఎంజీఆర్ ను ఇష్టపడతారు, నేను కూడా అలాగే ఆయనను ఇష్టపడతా. కానీ చట్టబద్ధమైన బాంధవ్యంలో ఆమోదం లభించలేదు. అది నా మనసును రగిలించింది, నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలన్న జ్వాల రగిలింది. నా జీవితంలో కీలకమైన సమయాల్లో మా అమ్మ జీవించి ఉండి ఉంటే, నా వ్యక్తిగత జీవితం ఇంతకన్నా ఎంతో బాగుండేదని నేను ఎప్పుడూ అనుకుంటా. అయితే డాక్టర్ ఎంజీఆరే, నా గుర్తింపు అని నేను నిరూపించాలని కోరుకుంటున్నా. భారతీయ సంప్రదాయంలో ఓ అమ్మాయి మొదట కూతురిగా పుడుతుంది, ఆ తర్వాత భార్య అవుతుంది, తల్లిగా మరణిస్తుంది. నేను భార్యను కాలేకపోయా. అయితే నేను కచ్చితంగా ‘అమ్మ’గానే మరణిస్తా’’ అని జయలలిత ధైర్యంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆమె మాటలు నిజమయ్యాయి. వివాహం జరిగి, పిల్లల్ని కంటే ఒకరిద్దరికే తల్లిగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు తమిళనాడు మొత్తానికి ‘అమ్మ’గా ప్రేమాభిమానాలను పంచిపెట్టారు, అదే స్థాయిలో తిరిగి ఆదరాభిమానాలు పొంది, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆమెను ‘అమ్మ’గా ఆదరించేలా చేసుకున్నారు. అమ్మను మించిన ‘అమ్మ’గా మారి, ఆమె కోరుకున్నట్లుగానే తుదిశ్వాస విడిచింది.

ఇవి కూడా చదవండి: కొత్తగా రూ 100 నోట్లు ... మరి పాతవాటి సంగతేంటి?

ఇవి కూడా చదవండి: జయలలిత డెత్ సర్టిఫికెట్ లో మిస్సయిందేమిటో తెలుసా

English summary

Tamilnadu Chief Minister who was died recently gave an interview to one of the Channel and Jayalalitha said some interesting facts about her personal life which was linked with MGR.