పన్నీర్ సెల్వంకే జయ శాఖలు అప్పగింత

Jayalalitha authority to Panneerselvam

12:35 PM ON 13th October, 2016 By Mirchi Vilas

Jayalalitha authority to Panneerselvam

పన్నీర్ సెల్వం... తమిళనాడు సీఎం జయలలితకు వీరవిధేయుడు... అన్నాడీఎంకేలో కీలకనేత. రెండుసార్లు సీఎంగా పదవీబాధ్యతలు నిర్వహించినా పాలనా పరంగా ఎటువంటి తొట్రుపాటు లేకుండా వ్యవహరించారు... తాజాగా సీఎం జయలలిత నిర్వహిస్తున్న మంత్రిత్వశాఖలను ఆయనకు బదలాయిస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు సీఎం జయలలిత ఆసుపత్రిలో అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. సీఎం అంటే రాష్ట్రానికి పరిపాలనా వ్యవస్థకు సారధి లాంటివారు. దీంతో సీఎం నిర్వహిస్తున్న శాఖలను అమ్మ వీర విధేయుడిగా పేరుపొందిన రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి పన్నీర్ సెల్వంకు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు అప్పగించారు.

పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. గతంలోను జయలలిత రెండు సార్లు సీఎం పదవికి రాజీనామా చేసిన సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు నిర్వహించిన సంగతి తెల్సిందే.

1/7 Pages

శాఖల బదలాయింపుపై కరుణ షాకింగ్ కామెంట్స్


అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సిఎం జయలలిత ఆదేశాల మేరకు ఆర్ధికమంత్రి పన్నీర్ సెల్వమ్ కు శాఖల బదలాయింపు జరిగిందని గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ప్రకటించారు. అయితే దీనిపై అప్పుడే కామెంట్స్ మొదలయ్యాయి డిఎంకే అధినేత కరుణానిధి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శాఖల బదలాయింపు జరగాలంటూ జయలలిత ఫైల్ పైన సంతకం చేశారా అని ఆయన ప్రశ్నించారు. ఫైల్ పైన సంతకం చేసేంత ఆరోగ్యంగా జయ ఉన్నారా అనేది కరుణ అనుమానం. అయితే ఆయన తనయుడు స్టాలిన్ మాత్రం శాఖల బదలాయింపు నిర్ణయాన్ని నిన్న స్వాగతించారు.

వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీ, స్టాలిన్ తదితరులు ఆసుపత్రికి వెళ్లినప్పుడు జయతో నేరుగా కలిసి మాట్లాడేందుకు ఎందుకు అనుమతించలేదని కరుణ ప్రశ్నిస్తున్నారు. 19 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నా జయ ఇంకా ఎంతకాలం చికిత్స పొందాల్సి వస్తుందో ఎవరికీ తెలియడం లేదని కూడా కరుణ అన్నారు. అసలు గవర్నర్ రాజ్యాంగంలోని అన్ని కోణాలను పరిశీలించాకే శాఖల బదలాయింపు నిర్ణయం తీసుకున్నారా అని కరుణానిధి ప్రశ్నిస్తున్నారు. జయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలు విడుదల చేయాలని కరుణ గతంలో డిమాండ్ చేశారు.

English summary

Jayalalitha authority to Panneerselvam