కుదుటపడ్డ అమ్మ ఆరోగ్యం.. దీపావళికి ముందే ఇంటికి!

Jayalalitha coming to home before Diwali

11:30 AM ON 21st October, 2016 By Mirchi Vilas

Jayalalitha coming to home before Diwali

మొత్తానికి తమిళనాట మళ్ళీ సందడి మొదలు కానుందా. అంటే అవుననే ఏఐడిఎంకె వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత దీపావళి పండుగకు ముందుగానే ఇంటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయట. జ్వరం, డీహైడ్రేషన్ తో గత నెల 22వ తేదీన జయలలిత ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే! డాక్టర్ శివకుమార్ నేతృత్వంలోని అపోలో వైద్యులు, ఇంగ్లాండ్ వైద్య నిపుణుడు డాక్టర్ జాన రిచర్డ్ బీలే, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం జయలలిత పూర్తిగా కోలుకున్నారని, అయితే, వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు.

సీఎం కోలుకున్నారని అపోలో ఆస్పత్రి వర్గాలు కూడా ధ్రువీకరించాయి. వెంటిలేటర్ తొలగించడంతో సాధారణంగానే శ్వాస తీసుకోగలుగుతున్నారని పేర్కొన్నాయి. ఇందుకోసం ఆమెకు సింగపూర్ వైద్యనిపుణులు సీమా, మేరీ ప్రత్యేకంగా ఫిజియోథెరపీ చేస్తున్నారు. బుధవారం లండన్ వెళ్లిన డాక్టర్ జానరిచర్డ్ బీలే నాలుగు రోజుల తర్వాత మళ్లీ చెన్నై రానున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన రాగానే జయను ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలన్నది నిర్ణయిస్తామని పేర్కొన్నాయి. అమ్మ కోలుకోవడం వల్లే న్యూస్ బులెటిన్ విడుదల చేయడంలేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా వుండగా ఎంజీఆర్ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ హెచవీ హండే విలేకరులతో మాట్లాడుతూ.. ఎంజీఆర్ లాగే జయ కూడా మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి బయటపడతారని పేర్కొన్నారు. ఎంజీఆర్ పక్షవాతంతో ఆస్పత్రిలో ఉన్నపుడు.. ఆయన పని అయిపోయిందంటూ ప్రతిపక్షాలు వదంతులు సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఎంజీఆర్ కోలుకుని తిరిగి పాలనా పగ్గాలు చేపట్టారని గుర్తు చేస్తున్నారు. నేతల ప్రకటనతో పార్టీ కార్యకర్తలు మాంచి హుషారుగా ఉన్నారట.

1/2 Pages

పంచె కట్టుతో కార్యకర్తల పాదయాత్ర..


కాగా ఉత్తర చెన్నైలో గురువారం ఉదయం 3 వేల మందికి పైగా కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. జయకు ఇష్టమైన ఆకుపచ్చరంగు పంచెలు కట్టుకుని మింట్ లో వున్న అంకాళ పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు పాదయాత్రగా టీహెచ రోడ్డు, టోల్ గేట్ మీదుగా తిరువొత్తియూరులో వున్న వడివుడయమ్మన ఆలయానికి చేరుకున్నారు.

English summary

Jayalalitha coming to home before Diwali