అమ్మ,... భౌతిక కాయాన్ని మళ్ళీ బయటకు తీస్తున్నారా

Jayalalitha Dead Body To Take Out From Graveyard

10:57 AM ON 31st December, 2016 By Mirchi Vilas

Jayalalitha Dead Body To Take Out From Graveyard

తమిళ విప్లవ నాయకి జయలలిత ను తమిళ ప్రజలు ఆప్యాయంగా అమ్మా అని సంబోధిస్తారు. అయితే ఇటీవల ఆమె మరణించిన విషయం తెల్సిందే. అయితే, అసుపత్రిలో చేరింది మొదలు 75 రోజుల వరకు అమ్మకు సంబంధించి ఒక్క ఫోటోలేదు, ఒక్క వీడియో లేదు…. 75 రోజుల తర్వాత “మన అమ్మ ఇక మనకు లేరు” అనే ప్రకటన తప్ప. ఇంతకీ ఏం జరిగింది, వైద్యం పేరుతో అపోలో ఆసుపత్రిలో అమ్మను ఏం చేశారు. అనే డౌట్స్ అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అయితే తాజాగా తమిళనాడు న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలమిచ్చేవిగా ఉన్నాయి. జోసెఫ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై స్పందిస్తూ….తమిళనాడు న్యాయవాది వైద్యలింగం ….. జయలలిత డెడ్ బాడీని బయటకు తీసి ఎందుకు పరీక్షించకూడదు,చనిపోయిన తర్వాత కూడా జయలలితకు అందించిన వైద్యం గురించి రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి ? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

ఈ ప్రశ్నల నేపథ్యంలో…జయలలిత డెడ్ బాడీని బయటికి తీసి..పరీక్షలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

జయలలిత బుగ్గపై గాట్ల మీద ఇంతవరకు ఎవరూ వివరణలు ఇవ్వకపోవడం.

చనిపోయే ముందు జయలలిత ముందు కాళ్లు లేవనే ఆరోపణలు, అందుకే జయలలిత ను దహనం చేయకుండా, పూడ్చారు అనే ఆరోపణలు అలాగే ఉండిపోయాయ్.

ఒక్క శశికళ కు తప్ప లోపలికి ఎవర్నీ అనుమతించకపోవడాలు కూడా అనుమానాలు అవకాశాలిస్తున్నాయి.

జయలలిత రహస్య చికిత్స విషయంలో నటి గౌతమి మోఢీకి లేఖ రాయడం, శశికళ పుష్ప సిబిఐ విచారణ కోరడం తెలిసినవే.

ఇవి కూడా చదవండి: భీమ్ మొబైల్ యాప్.. పనిచేసేది ఇలాగట

ఇవి కూడా చదవండి: మరణం అంచున వున్నా .. పిల్లల కోసం ఒక్క రోజులో రూ.17 కోట్లు సేకరించిన బాలుడు

English summary

Tamilnadu Ex - Chief Minister Jayalalitha was died and there were so many questions about her death and now one of the Lawyer in Tamilnadu was questioning that what were the marks spotted on the dead body of Jalalalitha's cheek and what was the medical treatment given to her.