అమ్మ ఫ్యామిలీ డాక్టర్ అసలు విషయం చెప్పేసారు

Jayalalitha Family Doctor Shocking Comments

06:22 PM ON 9th February, 2017 By Mirchi Vilas

Jayalalitha Family Doctor Shocking Comments

రెండవసారి ఎన్నికల్లో విజయం సాధించి సీఎం గా బాధ్యతలు చేపట్టి, ఇచ్చిన హామీలకు అనుగుణంగా పనులు చేస్తున్న అమ్మ జయలలిత సడన్ గ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో 75రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు ఈలోకం నుంచి నిష్క్రమించడం వెనుక మిస్టరీ ఉందని పలువురు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అపోలో వైద్యులు కూడా తమ తప్పేమీ లేదని తాము శాయిశక్తులా వైద్య సేవలు అందించామని, అయితే అన్ని అవయవాలు దెబ్బతిని , చివరకు గుండెపోటు రావడంతో మరణించారని వివరణ ఇచ్చారు. అయితే, జయలలిత అనారోగ్యం.. చికిత్స.. ఆపై మృతి. వీటికి సంబంధించి ఎన్నో అనుమానాలు. అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, లండన్ డాక్టర్ రిచర్డ్స్ బేలే.. ఇలా అనేకమంది వివరణ ఇచ్చినా జయ మృతిపై అనుమానాలు వీడడం లేదు. ఈ వివరాలపై జయలలిత మేనకోడలు దీప కూడా అనుమానం వ్యక్తం చేశారు.

ఇప్పుడు, జయలలిత ఫ్యామిలీ డాక్టర్.. అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ బంధువు అయిన శివకుమార్ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జయలలితకు సరైన వైద్యం అందించలేదన్నారు. తన పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరిగినట్లయితే ఆమె కోలుకునేవారని తెలపడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. మొత్తానికి తమిళనాట రాజకీయాలు హాట్ హాట్ గా వున్నాయి.

English summary

Jayalalitha Family Doctor Shocking Comments.