అబ్బో, ఏం భజన ... ఈ అమ్మ దయవల్ల హిల్లరీ గెలుస్తుందట

Jayalalitha inspired Hillary Clinton

12:40 PM ON 4th August, 2016 By Mirchi Vilas

Jayalalitha inspired Hillary Clinton

భజన బృందం రెచ్చిపోతే మామూలుగా ఉండదు. అవును, పాటలు పాడే భజన బృందాలు తన్మయత్వంతో ఊగిపోతూ భజన సాగిస్తారు. అందరినీ అందులో లీనం చేస్తారు. కానీ ఈ భజన బృందాలు అలా కాదు, ఇవి రాజకీయ నేతల చుట్టూ తిరుగుతూ, అన్నింటికీ తలూపేస్తారు. అంతలేదు ఇంతలేదు అంటూ రెచ్చగొట్టేస్తారు. అన్నీ మీ వల్లే అంటూ భజయిస్తారు. సరిగ్గా ఇదేకోవలో తమిళనాట సీఎం జయలలితను తెగ పొగిడేస్తున్నారు. చివరకు అమెరికా తొలి అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ నవంబర్లో గెలవబోతున్నారట. ఆమె విజయానికి కారణమెవరంటే తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితట! అవును ఇది వినడానికి ఎబ్బెట్టుగా వున్నా ఇది సాక్షాత్తూ ఆ పార్టీ శాసనసభ్యుని నోట వినిపించిన మాట.

అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఒకరు శాసనసభలో మంగళవారం అమ్మను పొగడ్తలతో ముంచెత్తి ‘జయ భజన’ను పరాకాష్టకు తీసుకెళ్లారు. కూనూరు శాసనసభ్యుడు రాము మాట్లాడుతూ ‘తమిళనాడులో మార్పును ప్రారంభించిది అమ్మే అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అంటూ సభలో జయలలితపై స్తోత్రం మొదలెట్టేసాడు. అంతటితో ఆయన ఆగిపోలేదు. ‘అమెరికా ఇప్పుడు మొట్టమొదటి అధ్యక్షురాలి కోసం ఎదురు చూస్తుండటానికి ప్రధాన కారణం కూడా అమ్మే (జయలలిత)’ అనేసరికి అన్నాడీఎంకే సభ్యులు అవాక్కవాల్సి వచ్చింది.

అంతలోనే తేరుకున్న వారు బల్లలు చరుస్తుంటే, విపక్షాలు విస్తుపోతూ చూడాల్సి వచ్చింది. ‘2011లో అమెరికా విదేశీ వ్యవహారాల కార్యదర్శి (యూఎస్ సెక్రటరీ ఫర్ స్టేట్)గా ఉన్న సమయంలో హిల్లరీ క్లింటన్ చెన్నైకి వచ్చి జయలలితతో సమావేశమయ్యారు. అప్పుడు అమ్మ పాలన చూసి ఎంతో స్ఫూర్తి పొందినట్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆ సమావేశం స్ఫూర్తితోనే హిల్లరీ క్లింటన్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారన్నారు. ‘యావత్ ప్రపంచం ఇప్పుడు ఆనాటి సమావేశం ప్రాముఖ్యాన్ని గుర్తు చేసుకుంటోంది’ అని ఆపకుండా జయ స్తోత్రం సాగించడంతో, భళి రా, భళి అంటూ అధికార పక్షం తలాడించింది. విపక్షం మాత్రం విస్తుపోయింది.

ఇది కూడా చూడండి: కాజల్ ఇలా హడలు గొడుతూ రివేంజ్ తీర్చుకుంటోందా ?

ఇది కూడా చూడండి: విమానంలోనూ ఈవ్ టీజింగ్ - తెలుగు వ్యక్తిపై కేసు నమోదు

ఇది కూడా చూడండి: ఛ.ఛ. రేప్ వీడియో క్లిప్ లు చౌకగా అమ్మేస్తున్నారట!

English summary

Jayalalitha inspired Hillary become United States presidential nominee.