ఇక అమ్మ ఆసుపత్రికే పరిమితమా!?

Jayalalitha is still in hospital

03:34 PM ON 7th October, 2016 By Mirchi Vilas

Jayalalitha is still in hospital

అవుననే సంకేతాలు వస్తున్నాయి. వైద్య నిపుణుల మాట కూడా అలానే వుంది. గత రెండు వారాలకు పైగా డీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని ప్రేవైట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. జయ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొనడం, వాస్తవాలు వెల్లడించాలని మరోపక్క డిమాండ్లు రావడం కూడా వింటున్నాం. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం జయలలిత ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు స్పష్టం చేశారు. లండన్, ఎయిమ్స్, అపోలో వైద్య నిపుణుల పరిశీలన అనంతరం సమగ్ర వైద్య ప్రణాళికను రూపొందించామని, ఆ మేరకు జయకు చికిత్స కొనసాగించాలని నిర్ణయించారు.

ఈ మేరకు అపోలో ఆస్పత్రి వర్గాలు గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశాయి. కార్డియాలజిస్టులు, శ్వాసకోశ నిపుణులు, ఇన్ఫెక్షన డిసీజ్ స్పెషలిస్టులు, డయాబెటాలజస్టలతో కూడిన వైద్య బృంద పర్యవేక్షణలో ముఖ్యమంత్రికి చికిత్స అందిస్తున్నామని తెలిపాయి. ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి శ్వాసకోశ చికిత్స నిపుణుడు డాక్టర్ గిల్నానీ, అనస్థీషియా నిపుణుడు అంజన ట్రికా, కార్డియాలజిస్ట్ నితిశ్ నాయక్ కూడా ముఖ్యమంత్రిని పరీక్షించారని, శుక్రవారం వరకు వారు ఇక్కడే ఉంటారని అపోలో ప్రతినిధులు వెల్లడించారు.

1/4 Pages

చికిత్సలపై సమగ్ర ప్రణాళిక...


అలాగే గత నెల 30న ముఖ్యమంత్రిని పరీక్షించిన లండన్ వైద్యుడు డా. రిచర్డ్ జాన బీలే గురువారం మరోసారి పరీక్షించారని చెప్పారు. వారి పరీక్షల అనంతరం ముఖ్యమంత్రి మధుమేహ స్థాయి, శీతాకాలంలో ఏర్పడే శ్వాసకోశ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని ఏ చికిత్స అందించాలన్నదానిపై సమగ్ర ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్వాస తీసుకొనేందుకు ఏర్పాటు, నెబులైజేషన్(మందులు ఎక్కించే ఏర్పాటు), ఊపిరితిత్తుల ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన మందులు, యాంటీ బయోటిక్స్ లను అందిస్తున్నామని వివరించారు. వైద్య నిపుణుల ఏకాభిప్రాయం అనంతరం ముఖ్యమంత్రికి ఈ చికిత్సలను తప్పనిసరిగా కొనసాగించాల్సిందేనని, ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి ఆస్పత్రిలోనే ఉండాలని అపోలో వైద్యులు ప్రకటనలో స్పష్టం చేశారు.

English summary

Jayalalitha is still in hospital