జయకు ఎందరున్నా ఒంటరిగానే జీవనం..

Jayalalitha lives singly

11:56 AM ON 6th December, 2016 By Mirchi Vilas

Jayalalitha lives singly

ఓ సినీ కవి అన్నట్టు జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది అనే పాటకు అనుగుణంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగత జీవితం సాగిందని చెప్పాలి. మైసూర్ లో పుట్టిన కోమలవల్లి, కుటుంబ నేపథ్యానికి దూరంగా జీవితంలో ఎక్కువ భాగం ఒంటరి జీవితాన్నే అనుభవించాల్సి వచ్చింది. చివరకు తుది శ్వాస విడిచే సందర్భంలోనూ తన కుటుంబానికి చెందిన వారెవరూ ఆమె దగ్గర లేకపోవడం విధి వైపరీపత్యమే.

1/6 Pages

జయలలిత అవివాహిత అయినప్పటికీ ఆమెకు సోదరుడు, సోదరి కుటుంబాలు ఉన్నాయి. బెంగళూరు, చెన్నైలలో ఆ కుటుంబాలున్నా చాలాకాలంగా ఆమెతో వాటికి సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. జయలలిత తల్లి నటి సంధ్య అసలు పేరు వేదవల్లి. జయ తండ్రి ఆర్. జయకుమార్. ఆయన తండ్రి మైసూర్ నల్వాడి కృష్ణరాజ వడియార్ సంస్థానంలో వైద్యులు.

English summary

Jayalalitha lives singly