షాకింగ్ న్యూస్ : జయ వారసురాలు ఈమెనట

Jayalalitha Niece Deepa Comments On Politics

11:10 AM ON 13th December, 2016 By Mirchi Vilas

Jayalalitha Niece Deepa Comments On Politics

జయలలిత మరణం తరువాత ఆమె వారసులెవరోనని అంతటా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి జయ నెచ్చెలి శశికళ చుట్టూ రాజకీయం తిరుగుతుంటే, ధైర్యం చేసి ఎవరూ ముందుకు రావడంలేదని అంటున్నారు. అయితే, అక్కడి పరిస్థితులు గుంభనంగా కనిపిస్తున్నా, తాజాగా లోలోన మాత్రం వేడి రగులుతోంది. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నా కూడా ఎప్పటికైనా ఆ పీఠంపై తాను కూర్చోవాలని జయ నెచ్చెలి శశికళ పావులు కదుపుతున్నారు. మరోవైపు జయ మేనకోడలు తాజాగా తానే అసలైన వారసురాలినంటూ ప్రకటన చేసింది..

జయలలితకు అసలైన వారసురాలిని తానేని ఆమె మేనకోడలు దీప తాజాగా ప్రకటించారు. జయ సోదరుడు జయకుమార్ కుమార్తె అయిన దీప, ప్రజలు కోరుకుంటే తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. తన మేనత్త జయలలిత లేని లోటును శశికళ ఎలా భర్తీ చేస్తారని ఏఐఏడీఎంకే నేతలే ప్రశ్నిస్తున్నారని ఆమె పేర్కొంటూ, ఏ రకంగా చూసినా తన మేనత్తకు వారసురాలిని తానేని ఆమె స్పష్టం చేసింది.

కాగా గతంలో ఆమె పోయెస్ గార్డెన్ లోని జయలలితకు చెందిన ఇంటిలో తనకు వాటా ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే... జయ ఆసుపత్రిలో ఉన్న సమయంలో దీప అక్కడకు రాగా ఆమెను లోనికి రానివ్వకుండా శశికళ మనుషులు అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీప తాజాగా తానే వారసురాలినని ప్రకటించుకోవడంతో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో నని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక డీఎంకే ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది.

ఇది కూడా చూడండి: ఈమె నిజంగా అమ్మ కూతురేనా? ఫోటో వెనుక దాగిన అసలు రహస్యం ఇదే

ఇది కూడా చూడండి: సీఎం పదవిలో ఉంటూ కన్నుమూసిన వాళ్ళు వీళ్ళే

ఇది కూడా చూడండి: ఆఫీస్ లో లేడీ బాస్ కంటే మెన్ బాస్ ఉంటే కలిగే ప్రయోజనాలు...

English summary

Jayalalitha Niece Deepa Comments On Politics.