హామీల అమలుకు 'అమ్మ' కసరత్తు

Jayalalitha Puts Her First Sign On Agricultural Loan Waiver

12:34 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Jayalalitha Puts Her First Sign On Agricultural Loan Waiver

తమిళనాడులో రెండోసారి అధికారంలోకి వచ్చిన జయలలిత కూడా ఎపి ఫార్ములాను నమ్మకున్నారు. అందుకే రుణ మాఫీతో పాటు పలు ‘ఉచిత’ హామీలు ఇచ్చారు. అవన్నీ ఫలించి జయను మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వరించింది. దీంతో జయ కూడా తనను గెలిపించిన రుణమాఫీ హామీని అమలు చేయడం కోసం.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం కోసం సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలిసంతకాన్ని రుణమాఫీ ఫైలు పై పెట్టారు.

అలాగే ఆమె ఎన్నికల వేళ ఇచ్చిన మిగతా హామీల పై చర్యలకూ సిద్ధమయ్యారు. విద్యుత్ సబ్సీడీలు తదితరాల పై సంతకం చేసేసిన జయలలిత... రాష్ట్రంలో మద్యం విక్రయాల సమయాన్ని కుదిస్తూ అధికారులు రూపొందించిన ఫైలుపై కూడా సంతకం చేశారు. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ కానున్న మద్యం షాపులు రాత్రి 10 గంటల దాకా మాత్రమే విక్రయాలు కొనసాగుతాయి.

ఇవి కూడా చదవండి:క్లాస్ రూమ్ లో స్టూడెంట్ తో సెక్స్ చేస్తూ దొరికేసిన టీచర్(వీడియో)

జయలలిత ఎన్నికలకు ముందు అధికారం నిలబెట్టుకోవడానికి పెద్ద కసరత్తే చేశారు. పొరుగు రాష్ట్రాల సహా మిగతా రాష్ట్రాల్లో విధానాలనూ పరిశీలించారు. అందులో అన్నిటికంటే మిన్నగా ఆమెను ఎపిలో చంద్రబాబు హామీ ఇచ్చిన రుణమాఫీ బాగా ఆకర్షించింది. తమిళనాడులో అలవాటైన ఉచిత హామీలతో పాటు కాస్త భిన్నంగా ఈ రుణమాఫీని కూడా ఆమె హామీ ఇచ్చారు. అనుకున్నట్లే ప్రజలు దానికి ఫిదా అయి అమ్మను గెలిపించారు. దీంతో ఆమె ఎంతో కీలకమైన రుణమాఫీ పైలుపైనే తొలి సంతకం చేశారు. మిగతా ఉచిత హామీల అమలుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:40 సంవత్సరాలుగా నిద్రపోని వ్యక్తిని చూశారా?

ఇవి కూడా చదవండి:సెలవలు ముగించి - రంగంలోకి రాజమౌళి

English summary

Tamilnadu Chief Minister Jayalalitha was into action by putting her first signature on Agriculture Loan Waiver across Tamilnadu State.