షాకింగ్ న్యూస్: అమ్మకు మరోసారి అంత్యక్రియలు!

Jayalalitha Relatives Perform Cremation Again

10:48 AM ON 15th December, 2016 By Mirchi Vilas

Jayalalitha Relatives Perform Cremation Again

ఒక వ్యక్తి చనిపోతే ఒకసారి అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరి అమ్మగా అందరి హృదయాల్లో నిలిచినా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు రెండోసారి అంత్యక్రియలు జరపడమేమిటని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్ళండి. జయ బంధువులు పవిత్ర నగరం శ్రీరంగపట్నంలో కావేరీ నదీ ఒడ్డున పశ్చిమవాహినిలో మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ ఆచారాల ప్రకారం ఆమెను దహనం చేయకుండా ఖననం చేసినందున ఆమె ఆత్మకు మోక్షం లభించదని, అలా జరగకూడదనే తాము మళ్లీ ఈ అంత్యక్రియలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన పూజారి రంగనాథ్ అయ్యంగార్ జయలలిత రూపానికి ప్రతిరూపంగా ఉండేలా ఒక బొమ్మను చేయించి, దానికి అంత్యక్రియలు చేయించారు. రాబోయే ఐదు రోజుల పాటు ఆమె ఆత్మశాంతి కోసం మరికొన్ని కార్యక్రమాలు చేయించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

జయలలితకు సోదరుడి వరసయ్యే వరదరాజు ఈ అంత్యక్రియలను దగ్గరుండి చేయించారు. ఆమె నమ్మకాలను పార్టీ సభ్యులు గౌరవించి ఉండాల్సిందని ఆయన భావించారు. తన సోదరి నాస్తికురాలు అయి ఉంటే ఆమె ఆలయాలకు వెళ్లేది కాదని, హిందూ ఉత్సవాల్లో పాల్గొనేది కాదని, అలాగే హిందూ సంప్రదాయాలను పాటించేది కాదని చెప్పారు. అసలు ఆమెను ఖననం చేయాలన్న నిర్ణయాన్ని పార్టీ ఎలా తీసుకుంటుందని వరదరాజు ప్రశ్నించారు. తామందరినీ అంత్యక్రియల నుంచి ఎందుకు దూరంగా పెట్టారని నిలదీశారు.

జయలలిత డిసెంబర్ ఐదోతేదీ రాత్రి మరణించగా, ఆరోతేదీన ఆమెను ఖననం చేసారని అయితే జయలలిత హిందూ ఆచారాలను గట్టిగా పాటిస్తారని, అందువల్ల అయ్యంగార్ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేస్తే బాగుండేదని కొంతమంది బంధువులు అన్నారు. ఆమెను ఖననం చేసిన తీరుపై మైసూరు, మేలుకోటె నగరాల్లో ఉండే జయ మేనల్లుళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లు కూడా తాజాగా నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: బంధువైన మహిళా ఉద్యోగినిపై లైంగిక దాడి - మంత్రి రాజీనామా

ఇవి కూడా చదవండి: ఇక్కడ బిర్యానీలో ఆ మాంసం కలుపుతున్నారా ?(వీడియో)

English summary

Tamilnadu Ex-Chief Minister Jayalalitha was died and she was not fired and she was Buried near Marina Beach in Chennai. Recently Jayalalitha's relatives perform funeral again to her and they questioned that why she was buried instead of burned. They said that they have done this because to get Moksha to her Sin.