అమ్మ 'ఆత్మ' సమాధి దగ్గర తిరుగుతోంది?

Jayalalitha Spirit Found Near Marina Beach

11:32 AM ON 13th December, 2016 By Mirchi Vilas

Jayalalitha Spirit Found Near Marina Beach

వావ్ ఇది నిజమా కాదా అంటే నిజమని అమ్మ భక్తులు నమ్ముతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది. తమిళ ప్రజలు ‘అమ్మ’గా భావించే ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణం తమిళనాడులోనే కాదు యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అమ్మ ఇక లేరనే వార్తను తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మ సమాధి అయి అయిదు రోజులు దాటినా మెరీనా బీచ్ లో అమ్మ సమాధి వద్ద ఇంకా రద్దీగానే ఉంది.

ఈ నేపథ్యంలో ‘అమ్మ’ సమాధి వద్ద ఓ ఆత్మ కనిపించిందని తమిళ వెబ్ సైట్లు వార్తలు ప్రచురించాయి. ఆ ఆత్మ ‘అమ్మ’ ఆకారాన్ని పోలి ఉందని, తన సమాధిని చూసేందుకు జయలలిత ఆత్మగా వచ్చిందంటూ ఆ వెబ్ సైట్లు చెబుతున్నాయి. ‘అమ్మ’ ఆత్మ అంటూ ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. యావత్తు తమిళ జాతికి అమ్మగా నిలిచిన జయలలిత ఆకస్మిక మరణం మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. ఆమెది సహజ మరణం కాదని, విష ప్రయోగం జరిగిందని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఆత్మలపై నమ్మకం ఉన్న వాళ్లు సమర్ధించడానికి ఓ కారణం కూడా దొరికింది. అమ్మకు ప్రధాని కావాలనే కోరిక ఉండేదని, అది తీరకపోవడంతో ఆత్మగా మారి ఉంటుందని పలువురు చెప్పేమాట. ఆ దిశగా వాదన చేస్తున్నారు. ఆధునిక కాలంలోనూ ఇవేం మూఢనమ్మకాలంటూ చాలా మంది నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. ఇది కచ్చితంగా ఫొటోషాప్ మాయాజాలమే అని కొట్టిపారేస్తున్నారు. కావాలనే సమస్యను తప్పుదోవ పట్టించే దిశగా ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి అమ్మ మరణించినా ఇంకా ఆమెపై సంచలన వార్తలు కొనసాగుతూనే వున్నాయి.

ఇవి కూడా చదవండి: వారెవ్వా ... డైపర్లలో బంగారు కడ్డీలు... వాటి విలువ ఎంతో తెలిస్తే మతిపోద్ది

ఇవి కూడా చదవండి: అపోలో హాస్పిటల్ బిల్లు కట్టాలంటే 'అమ్మ' ఆస్తులు అమ్మినా చాలవంట

English summary

Tamilnadu's Ex-Chiefminister died recently and she was buried near Marina Beach in Chennai and recently a video was going all over the social media that Jayalalitha's Spirit was roaming near Marina Beach.