అమ్మ కొలువు నుంచి మరొకరికి  చెక్     

Jayalalitha Suspends Another Minister Chinnayya

06:11 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Jayalalitha Suspends Another Minister Chinnayya

ఎన్నికల వేళ ఎన్నెన్ని వింతలో అంటారు కదా, సరిగ్గా తమిళనాట అదే జరుగుతోంది. మరో రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కీలక నిర్ణయాలపై దృష్టి పెట్టింది. తాజాగా, తన కేబినెట్‌ నుంచి ఓ మంత్రిని తప్పించారు. తమిళనాడు పశుసంవర్థకశాఖ మంత్రి టీకేఎం చిన్నయ్యను తప్పించి... ఆ శాఖను స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి నళర్మతికి అప్పగించినట్లు తమిళనాడు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. గత రెండు వారాల వ్యవధిలో జయలలిత ఇద్దరు మంత్రులకు కేబినెట్‌ నుంచి ఉద్వాసన పలికారు. ఫిబ్రవరి 20న డెయిరీ, సహకారశాఖ మంత్రి బీవీ రమణను తప్పించగా, ఇప్పుడు చిన్నయ్య కు చెక్ పెట్టారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణల కారణంగానే ఇరువురు మంత్రులపై జయలలిత వేటు వేసినట్లు చెబుతున్నారు. ఇంకా ఎన్ని సంఘటనలు జరుగుతాయో చూడాలి. అమ్మ తలచుకుంటే హద్దు వుండదు కదా ...

English summary

Tamilnadu Chief Minister Jaya Lalitha Had suspended another cabinet minster TKM.Chinnayya. Previously she suspended minister B.V.Ramana.