హమ్మయ్య అమ్మ మాట్లాడుతోందట(వీడియో)

Jayalalitha was recovering well says aiadmk leader

11:56 AM ON 5th November, 2016 By Mirchi Vilas

Jayalalitha was recovering well says aiadmk leader

తమిళనాడు సీఎం జయలలిత కోలుకుంటున్నారని, త్వరలో ఆమెను సీసీయూ(క్రిటికల్ కేర్ యూనిట్) నుంచి ప్రైవేటు రూమ్ కు షిఫ్ట్ చేస్తారని సీనియర్ అన్నాడీఎంకె నాయకుడొకరు తెలిపారు. జయ ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, వెంటిలేటర్ ను మెల్లగా తొలగించాలని డాక్టర్లు యోచిస్తున్నారని ఆయన చెప్పారు. తరచూ మాత్రమే దాన్ని వినియోగిస్తున్నారని ఆయన అన్నారు. ఇడ్లీ వంటి ఆహార పదార్థాలను అమ్మ తీసుకుంటున్నారు.. తన సన్నిహితులతో మాట్లాడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇదే టైమ్ లో జయలలిత ఆసుపత్రి పడక దిగి నడుస్తూ కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది.

అయితే, ఇది లేటెస్ట్ కాదని గతంలో తీసిన వీడియో అని కామెంట్స్ వస్తున్నాయి. గత సెప్టెంబరు 22న జయలలిత తీవ్రమైన అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. తమిళనాడు ఉప ఎన్నికల తేదీలోగా జయలలిత డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుతారనే అన్నాడీఎంకె వర్గాలు చెబుతున్నాయి.

1/4 Pages

డాక్టర్లు ఏమన్నారంటే...


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో హాస్పిటల్స్ సీఎండీ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేస్తూ, జయలలిత పూర్తిగా కోలుకున్నారు. ఆమెకు ఏం కావాలో అడుగుతున్నారు. తన చుట్టూ ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకుంటున్నారు. ఎప్పుడు ఇంటికి వెళ్లాలనే దానిపై ఆమే నిర్ణయం తీసుకుంటారు అని వెల్లడించారు. కాగా తీవ్ర జ్వరం కారణంగా జయలలిత సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

English summary

Jayalalitha was recovering well says aiadmk leader