తమిళనాట జయకేతనం - సరికొత్త రికార్డు సొంతం

Jayalalitha won with high majority

04:41 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Jayalalitha won with high majority

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఏఐఏడీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 232 స్థానాలకు మెజార్టీ సీట్లు ఆ పార్టీ కైవసం చేసుకుని ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారం తిరిగి నిలబెట్టుకుంది. ఇక అధికారంలో ఉన్న పార్టీ తదుపరి ఎన్నికల్లో తమ అధికారం నిలబెట్టుకున్న చరిత్ర తమిళనాడులో కొత్తకాదు. స్వాతంత్య్రం అనంతరం జరిగిన ఎన్నికలు మొదలుకొని ... 1967 వరకు తమిళనాట కాంగ్రెస్‌ హవా కొనసాగింది. 1967లో కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడి అణ్నాదురై నేతృత్వంలోని డీఎంకే అధికారం చేపట్టింది. అణ్నాదురై మరణానంతరం ముఖ్యమంత్రి అయిన కరుణానిధి 1971లో జరిగిన ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకున్నారు.

డీఎంకీని వీడి అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించిన ఎంజీఆర్‌ 1977లో శాసనసభ ఎన్నికల్లో అధికారం చేపట్టి 1980, 1984 ఎన్నికల్లో తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఆ ఎన్నికల తర్వాత ఎంజీఆర్‌ మరణానంతరం జరిగిన ఏ శాసనసభ ఎన్నికల్లోనూ తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండో సారి అధికారాన్ని నిలబెట్టుకోలేదు. 1984 తరువాత.. 1989లో డీఎంకే,1991 - అన్నా డీఎంకే, 1996 - డీఎంకే, 2001- అన్నా డీఎంకే, 2006- డీఎంకే, 2011- అన్నా డీఎంకే విజయం సాధించాయి. ఇలా గత మూడు దశాబ్దాలుగా జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తమిళనాట తిరిగి అధికారం చేపట్టలేదు. ఎంజీఆర్‌ ఆ తరువాత 2016లో ఆ రికార్డును జయలలిత తిరిగి లిఖించారు.

English summary

Jayalalitha won with high majority