ఈసారి నెగ్గినా.. సిఎమ్ పదవి  దక్కేనా !

Jayalalithaa To Attend In Supreme Court On May 19

10:48 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Jayalalithaa To Attend In Supreme Court On May 19

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వ్యవహారం అడకత్తెరలో పోక చెక్క మాదిరి తయ్యరైంది. మేలో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికార పీఠం అధిరోహించాలని జయమ్మ చేస్తున్న ప్రయత్నం అంటూ ఏదీ లేదు. చివరకు విజయకాంత్ సొంతంగా బరిలో దిగాలనే ప్రకటన వెనుక కూడా జయ వ్యూహం వున్నట్లు చెబుతున్నారు. ప్రత్యర్ధులను ఖంగు తినిపిస్తూ, ఎన్నికల వ్యూహం నడుపుతున్న జయకు ఎన్నికల కంటే, మరో పెద్ద గండం పొంచి వుంది. దీంతో ఆమె ఈ సారి ఎన్నికల్లో నెగ్గినా, సిఎమ్ కుర్చీ అందుతుందా లేదా అన్నది అనుమానంగా వుందని అంటున్నారు. ఎందుకంటే అమ్మకు కోర్టు కేసుల కష్టాలు ఇప్పుడే తీరేలా కనిపించడం లేదు.

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. ఈ కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించగా, ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. పైగా ఈ కేసు విచారణ తుది తీర్పు మే నెల 19వ తేదీన వెల్లడి అవుతుందట. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే సుప్రీం తీర్పు వెల్లడయ్యే పరిస్థితి వున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు ఒక వైపు ఎన్నికల గండం కంటే మరోవైపు పొంచి ఉన్న కోర్టు గండం ఇరకాటంలో నెట్టే పరిస్థితి ఉండడంతో రకరకాల ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఈ ప్రభావం ఎన్నికల మీద పడితే మొదటికే మోసం వస్తుందన్న భయం వెంతాడుతోందట.

తీవ్రంగా గాయపడ్డ ఆదిత్య రాయ్‌ కపూర్‌

పవన్‌ స్టామినాకు తగిన పవర్ ఫుల్ డైలాగ్

ఫేస్ బుక్ పరిచయంతో ఫ్రెండ్స్ తో కలిసి రేప్

English summary

Tamilnadu Chief Minister Jaya Lalita to attend in Supreme court because of illegal Assets case. Even though she win in Tamilnadu Elections She will not become Chief Minister.