డామిట్ తమిళనాట కధ అడ్డం తిరిగింది - శశికళ సీఎం అవ్వడం ఖాయమట

Jayalalithaas Nephew Deepak Sasikala To Become Next CM Of Tamilnadu

11:30 AM ON 4th January, 2017 By Mirchi Vilas

Jayalalithaas Nephew Deepak Sasikala To Become Next CM Of Tamilnadu

తమిళనాట అమ్మగా అందరి ఆదరాభిమానాలు అందుకుని ఇటీవల కన్నుమూసిన దివంగత సీఎం జయలలిత లేని లోటు తమిళనాట కనిపించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఆమె మరణం తర్వాత పన్నీరు సెల్వం సీఎం గా ప్రమాణం చేసినప్పటికీ, జయ నెచ్చెలి శశికళ పార్టీలో తన బలం పెంచుకుంటున్నారు. ప్రధాన కార్యదర్శి పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇప్పటికే పలువురి ద్వారా చిన్నమ్మ సీఎం కావాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ కోవలోకి జయలలిత కుటుంబ సభ్యులు వచ్చి చేరారు. జయలలిత సోదరుడు జయకుమార్ కుమారుడు దీపక్ మీడియాతో మాట్లాడుతూ శశికళ అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు స్వీకరించి తమ మేనత్త జయలలిత ఆశయాలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అదే రీతిలో సీఎం పగ్గాలు కూడా స్వీకరించాలని కోరారు. ఈ మేరకు త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారని కూడా ప్రకటించారు.

జయలలిత అంత్యక్రియల సమయం నుంచి శశికళతో వైపు మొగ్గు చూపిన దీపక్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ త్వరలో తమ మేనత్త జయలలిత వారసురాలిగా శశికళ ఆంటీ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని ప్రకటించడం సంచలనం రేపింది. ఇది కేవలం తన డిమాండ్ మాత్రమే కాదని అన్నాడీఎంకే నాయకులు సైతం తమ మేనత్త స్థానంలో చిన్నమ్మ బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారని దీపక్ సెలవిచ్చాడు.. ఇదిలా ఉండగా దీపక్ వ్యాఖ్యలపై శశికళ ప్రత్యర్థి వర్గం స్పందించింది. దీపక్ మాటలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని వారు కొట్టిపారేస్తున్నారు. కాగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మేనత్త వారసురాలిగా శశికళ అరంగేట్రాన్ని సహించలేని సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళకు అప్పగించరాదని సీఎం కుర్చిలో కుర్చోపెట్టరాదని డిమాండ్ చేసిన క్రమంలో తాజాగా దీపక్ ఎంట్రీతో పాటు చిన్నమ్మ సీఎం కావాలనే డిమాండ్ చేయడం కలకలం రేకెత్తిస్తోంది. మొత్తానికి తమిళనాట సరికొత్త రాజకీయానికి తెరలేస్తోంది.

ఇవి కూడా చదవండి: కిడ్నీలను శుభ్రంగా ఉండాలా అయితే దివ్యౌషదం తయారుచేసుకోండి

ఇవి కూడా చదవండి: శశికళా పుష్ప భర్త, లాయర్లను చావగొట్టారు

English summary

After the death of AMM Jayalalitha the politics in Tamilnadu was heated up and now Jayalalitha's Nephew Deepak Jayakumar said that Sasikala would be the next Chief Of AIDMK and she woulb be the Tamilnadu's Next Chief minister.