'అమ్మ' మేనకోడలు ఎంటర్ అయిపోతోందట

Jayalalitha's niece entered the politics

11:40 AM ON 9th January, 2017 By Mirchi Vilas

Jayalalitha's niece entered the politics

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సీఎం పన్నీరు సెల్వం , అన్నా డీఎంకే అధినేతగా ఎన్నికైన శశికళ మధ్య అధికార పీఠం కోసం రచ్చ జరుగుతోందని వార్తలు వస్తుంటే, మరోపక్క రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న జయలలిత మేనకోడలు జె.దీపాకుమార్ తాజాగా సొంత పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇప్పటికే ఆమె సంకేతాలు ఇవ్వగా...ఇప్పుడు సొంత పార్టీతోనే జనం ముందుకు వెళ్లాలని నిశ్చయించుకోవడం ద్వారా తమిళనాట మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి తెరతీయనున్నారు. త్వరలోనే కొత్త పార్టీ వివరాలు వెల్లడిస్తానని తనను కలిసేందుకు వచ్చిన అన్నాడీఎంకే కార్యకర్తలతో దీప తెలిపారు. ఈనెల 17 నుంచి జరుగనున్న అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం చేద్దామని పార్టీ క్యాడర్ కు ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఎంజీఆర్ ఆశీస్సులతో ఆ రోజు నుంచే మనం కలిసి ముందుకు సాగుదామని తెలిపారు. అనంతరం దీపాకుమార్ మీడియాతో మాట్లాడుతూ, తాము కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నామని, త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేస్తామని చెప్పారు. ప్రతిరోజూ దీప ఇంటికి పెద్దఎత్తున కార్యకర్తలు వస్తుండటంతో ఆమె 'రెండు ఆకుల గుర్తు'ను ఊపుతూ తన మద్దతుదారులకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. జయలలితకు దీప పుష్పగుచ్ఛం ఇస్తున్నట్టు గ్రాఫిక్ వర్క్ తో రూపొందించిన బ్యానర్లు, పోస్టర్లు దీప ఇంటి ముందు వెలిసాయి.మూత్తానికి రసవత్తర రాజకీయం నడుస్తోంది.

ఇది కూడా చూడండి: ఒక్కడినే ప్రేమించిన తల్లీకూతుళ్ళు! ఆ తరువాత ఏమైందో తెలుసా?

ఇది కూడా చూడండి: నాగ్ వెంటే తిరుమల శ్రీవారు ... ఎందుకంటే ..

ఇది కూడా చూడండి: 4 రోజుల్లో బరువు తగ్గడానికి సూపర్ చిట్కా

English summary

Jayalalitha's niece entered the politics after the death of Jayalaith.Kept her own party and changes also taken place in the party.