జాక్ పాట్ కొట్టిన జయప్రద

Jayaprada elected as a deputy chairperson

03:44 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Jayaprada elected as a deputy chairperson

అలనాటి అందాల తార, మాజీ ఎంపీ శ్రీమతి జయప్రద నహతా ఉత్తరప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి డిప్యూటీ చైర్ పర్సన్ గా నియమితులయింది. ఈ నియామకం తర్వాత సినీనటి జయప్రద తొలిసారిగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావడంతో ఆమెకు అభిమానులు ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం పలికారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.. ఆమెను అభిమానులు పూలమాలలు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తనను ఉత్తరప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి డిప్యూటీ చైర్ పర్సన్ గా నియమించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ములాయంసింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ కు కృతఘ్నతలు చెప్పుకుంది. సాహితీవేత్త నీరజ్ ను చైర్మన్ గా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందని జయప్రద అంటోంది. సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను పూర్తిస్థాయిలో తోడ్పడతానని చెప్పారు. బొంబాయి హాలీవుడ్ మాదిరిగా యూపీ సినీ పరిశ్రమను తీర్చిదిద్దుతానన్నారు. తెలుగు, తమిళ సినీ అభిమానులు తనను ఎంతో కాలంగా ఆదరిస్తున్నారని, టాలీవుడ్, కోలీవుడ్ అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషిచేస్తానని జయప్రద చెప్పుకొచ్చింది. రాజమహేంద్రవరానికి చెందిన జయప్రద ఏపీలో తెలుగుదేశం తరపున అప్పట్లో విస్తృత ప్రచారం చేసింది.

ఆ పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆతర్వాత ఆపార్టీతో ఏర్పడ్డ వైరుద్యంతో యూపీకి వెళ్లిన ఈమె రామ్ పూర్ నుంచి రెండుసార్లు లోకసభకు సమాజ్ వాది పార్టీ తరపున ఎన్నికైంది. ఆ పార్టీలో కూడా తేడా రావడంతో కొంతకాలంగా స్తభద్రతగా వున్న జయప్రదకు మళ్ళీ యుపిలో కీలక పదవి దక్కడం విశేషం.

ఇది కూడా చదవండి: 'గ్యారేజ్' లో ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ అదుర్స్.. ఇలాగే దూసుకుపోవాలట!

ఇది కూడా చదవండి: ఒంటిమీద చీరను విప్పి ముగ్గురు ప్రాణాలను కాపాడింది!

ఇది కూడా చదవండి: వినాయక చవితికి 21 పత్రాలతో పూజ.. నిమజ్జనం వెనుక అసలు కధ తెలుసా?

English summary

Jayaprada elected as a deputy chairperson