అలాంటి మహిళగా ఉండనన్న జయసుధ

Jayasudha About Her Role In Politics

10:13 AM ON 25th January, 2016 By Mirchi Vilas

Jayasudha About Her Role In Politics

దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో చేరి , సికింద్రాబాద్ ఎంఎల్ఎ గా కాంగ్రెస్ టికెట్ పై నెగ్గి , గత ఎన్నికల్లో ఓటమి చెంది, ఇటీవల సైకిలెక్కిన మాజీ ఎంఎల్ఎ , సహజ నటి జయసుధ టిడిపిలో కీలక రోల్ పోషించబోతున్నారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఎంఎల్ఎ రోజాకు కౌంటర్ గా జయసుధను ప్రయోగిస్తారని అంతా భావిస్తున్న నేపధ్యంలో తన ధోరణి ఏమిటో ఆమె స్పష్టం చేసారు. 'రోజా వేరు , నేను వేరు, ఓ నటిగా నేను ,ఆమె కలసినపుడు బానే మాట్లాడుకుంటాం. అంతమాత్రం చేత ఆమెలా మాట్లాడతానని ఎలా అనుకుంటారు' అని జయసుధ ప్రశ్నిస్తున్నారు.

రాజకీయాల్లో విమర్శలు , ప్రతివిమర్శలు సహజమని అయితే అలాంటి భాష మాట్లాడాల్సిన అవసరం లేదని జయసుధ స్పష్టం చేసారు. అటు నుంచి పది మాటలు మాట్లాడితే ఇటు నుంచి ఓ మాటతోనే సమాధానం ఇవ్వవచ్చని ఆమె అంటున్నారు. అయినా అలాంటి మహిళగా వుండాలని అనుకోవడం లేదని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఎపి సిఎమ్ చంద్రబాబు , టిడిపి ఎంఎల్ఎ ల పై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెల్సిందే. అంటే అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి జయసుధ సుతారమూ ఇష్ట పడదని అర్ధం అయిపొయింది. అంచేత రోజా పై జయసుధను అస్త్రంగా వాడాలనుకున్నా ప్రయోజనం ఉండదని కూడా తేలిపోయింది.

English summary

Veteran Actress and Ex-MLA Jayasudha recently joined in Telugu Desam Party (TDP) and she said that she was very calm in politics and she said that Roja and she were very good friends when it comes to films.