అవును నిజంగా ఏడ్చేసా: జయసుధ

Jayasudha acted with real tears in Brahmotsavam movie

09:57 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Jayasudha acted with real tears in Brahmotsavam movie

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ ఆడియో లాంచ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహజ నటి జయసుధ ఈ సందర్భంగా భావోద్వేగంతో మాట్లాడారు. 'ఓ నటిగా నేను ఎన్నో ఎమోషనల్ సీన్స్ చేశా.. అయితే ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో మాత్రం నిజంగా ఏడ్చేశా' అని అన్నారు. క్లైమాక్స్ సీన్‌లో మహేష్ బాబు నటనకు తనకు కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయని ఆమె తెలిపారు. చాలాకాలం తర్వాత తన సినీ కెరీర్‌లో సినిమాపరంగా కాకుండా నిజంగా కన్నీటి పర్యంతమైనట్టు చెప్పారు. క్లైమాక్స్ సన్నివేశంలో మహేష్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని జయసుధ కితాబిచ్చారు. శ్రీకాంత్ అడ్డాలతో తనకిది మూడో సినిమా అన్నారు.

English summary

Jayasudha acted with real tears in Brahmotsavam movie. Jayasudha told in Brahmotsavam audio launch that i was acted with real tears in Brahmotsavam movie climax.