సొంత కొడుకుని పోలీసులకి పట్టించిన జయసుధ!!

Jayasudha gives message to people by shortfilm

01:35 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Jayasudha gives message to people by shortfilm

సహజనటి జయసుధ సొంత కొడుకునే పోలీసులకి అప్పచెప్పి తన గొప్పతనాన్ని చాటుకుంది. ఆగండి ఆగండి ఇదంతా నిజ జీవితంలో కాదు రీల్‌ జీవితంలో. షీ టీమ్ గురించి ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లేందుకు తెలంగాణ పోలీస్‌ యంత్రాంగం వారు ఓ షార్ట్‌ ఫిలిం తయారు చేశారు. ఈ షార్ట్‌ ఫిలింలో సహజనటి జయసుధ ముఖ్యపాత్రలో నటించింది. ఇందులో అమ్మాయిల వెంటపడే వాళ్లని ఏడిపించే ఈవ్‌ టీజర్లను పోలీసులకు జయసుధ పట్టిస్తుంది. అందులో తన కొడుకు కూడా ఉంటాడు. పోలీసులకి పట్టించాక 'అయిపోయాక తిట్టడం కాదు', 'అవుతున్నప్పుడే ఆపడం నేర్చుకోండి' అంటూ ప్రజలని ఉద్ధేశించి ఒక మెసేజ్‌ కూడా ఇచ్చింది.

ఇప్పుడు ఈ షార్ట్‌ ఫిలిం సోషల్‌ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తుంది. వేలు నుండి లక్ష వరకు దాటి వ్యూలు పెరిగిపోతున్నాయంటే ఈ మెసేజ్‌ ఎంత మందిని కదిలించిందో అర్ధమవుతుంది.


English summary

Jayasudha gives message to people by shortfilm called 'She Team'.