జయసుధ సైకిల్ ఎందుకు ఎక్కినట్టు?

Jayasudha Joined In TDP

10:01 AM ON 19th January, 2016 By Mirchi Vilas

Jayasudha Joined In TDP

రాజకీయాలంటేనే విసిగిపోయిన సహజనటి జయసుధ సడన్ గా టిడిపి గూటికి రావడం వెనుక కారణం ఏమిటని సర్వత్రా చర్చ కు దారితీసింది. పైగా గ్రేటర్ ఎన్నికల వేళ చేరడంతో ప్రాధ్యాన్యత సంతరించుకుంది. ఓ రకంగా వైసిపి నేత జగన్ కి దెబ్బే నని చెప్పక తప్పదు. 2009 ముందు వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న జయసుధ ను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి తీసుకు వచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే వైయస్ మృతి అనంతరం జయసుధ ఇటు కాంగ్రెస్, అటు వైసిపి వైపు కొద్ది రోజులు ఊగిసలాడారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు బండ కార్తీక రెడ్డి ప్రత్యర్థి వర్గం గా వుండేది. ఆమె ఆధిపత్యం విషయమై జయసుధ ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే నాలుగేళ్ల క్రితం ఆమె వైసిపిలో చేరేందుకు మొగ్గు చూపినట్లు వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు.ఆ తర్వాత రాజకీయాల పైన ఎన్నోసార్లు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంకా సైలెంట్ అయిపోయిన జయసుధ ఇప్పుడు సైకిల్ ఎక్కారు.

మా ఎన్నికల్లో జయసుధను పోటీలో దింపిన రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్ చొరవ తీసుకుని టిడిపిలోకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. గతంలో జగన్ వైపు మొగ్గి చూపి ఆ తర్వాత వెనక్కి తగ్గిన జయసుధ ఇప్పుడు పచ్చ కండువా కప్పుకోవడం ఓ రకంగా జగన్ కి షాకే. ఇప్పటికే పలువురు నేతలు వైసిపిని వీడుతుండగా , ఇక అందులో చేరి ప్రయోజనం ఏమని భావించి, టిడిపి తీర్ధం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది.

English summary

Veteran Heroine Jayasudha joined in Telugu Desam Party.Previously she was in Congress Party.A news came to know that Rajahmundry MP Murali Mohan helped jayasudha to join in TDP