జేసి బ్రదర్స్ రిటైర్! - వారసులోస్తున్నారోచ్!

J.C Brothers sons political entry !

11:30 AM ON 2nd January, 2016 By Mirchi Vilas

J.C Brothers sons political entry !

అనంతపురం రాజకీయాల్లోనే కాదు ఎపి రాజకీయాల్లోనే జేసి బ్రదర్స్ కి ఓ ప్రత్యేకత వుంది. సంచలనానికి మారుపేరు. రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి , తెలుగుదేశం పార్టీలో చేరిన జేసి బ్రదర్స్ లో అన్న జేసి దిఎవాకర్ రెడ్డి ఎంపి గా , తమ్ముడు జేసి ప్రభాకర రెడ్డి ఎం ఎల్ ఎ గా ఎన్నికయ్యారు. అయితే వచ్చే ఎన్నికలనాటికి వీరిద్దరూ రిటైర్ మెంట్ తీసుకుని కొడుకులను రంగంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడూ ఇటీవల కాలంలో జేసి బ్రదర్స్ తనయులు చేపడుతున్న కార్యక్రమాలు , చేస్తున్న హంగామా ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది.

కాంగ్రెస్ రక్తాన్ని నరనరాన జీర్ణించుకున్న జేసి బ్రదర్స్ అనుకోని పరిస్థితిల్లో టిడిపి గూటికి చేరినా , ఇంకా తమలో కాంగ్రెస్ రక్తం వుందని చెబుతూనే వుంటారు ఈ అపూర్వ సహోదరులు. ఆయా అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వుంటారు. సంచలన వ్యాఖ్యలకు వేదిక అవుతుంటారు. ఆయనే రూటే వేరు మరి.

ఇక జేసీ సోదరుల వారసులు అయితే , ఇటీవల ప్రభుత్వ అభివృద్ధి పనులతోపాటు తమ సొంత ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాల్లో కూడా బిజీ బిజీ అవుతున్నారు. అవకాశం వస్తే చాలు, ప్రజలకు చేరువయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా రాజకీయాల్లో ఇమడ లేక ప్రతి రోజు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో విమర్శలు చేస్తున్న జేసీ దివాకర్ రెడ్డి తన వారసుడిగా జేసీ పవన్ రెడ్డిని తెరపైకి తెస్తున్నారని అంటున్నారు. పవన్ అనంతపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు పండగకు కావాల్సిన సరుకులు పంపిణీ చేసిన పవన్ రెడ్డి ఒలింపిక్ రన్ అనంతపురంలో ఏర్పాటుచేసి, యువతను ఆకట్టుకునే విధంగా అజారుద్దీన్ సినీతార రెజినా తదితర సెలబ్రిటీలను పిలిపించి నానా హంగామా చేశారు. అలాగే క్రిస్మస్ ని పురస్కరించుకుని అన్ని చర్చిలలో ప్రార్థనలను నిర్వహించి కేక్ లను పంచిపెట్టారు.

పవన్ పొలిటికల్ ఎంట్రీతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారని టాక్. వచ్చే ఎన్నికల్లో పవన్ రెడ్డి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే సూచనలు కానవస్తుంటే ,ఇక జేసీ సోదరులకు కంచుకోట అయిన తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిపెట్టారు. ప్రభాకర్ రెడ్డి వెంట ఉంటూ అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ, వివిధ కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు.

పవన్ ,అస్మిత్ రాజకీయ ఆరం గేట్రం చేస్తే , జేసి బ్రదర్స్ మాదిరిగా రాజకీయల్ల్లో తమదైన ముద్ర వేస్తారా లేదో చూడాలి. ఇక రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదనే నానుడికి భిన్నంగా జేసి బ్రదర్స్ రాజకీయాలకు నిజంగానే గుడ్ బై కొడితే , అది కూడా రికార్డే ....

English summary