పవర్ స్టార్ కి చురకలంటించిన జేసీ

JC Diwakar Reddy Comments On Pawan Kalyan

10:39 AM ON 29th August, 2016 By Mirchi Vilas

JC Diwakar Reddy Comments On Pawan Kalyan

సాధారణంగా సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగులు కొడితే జనం చప్పట్లు కొడతారు. కానీ రాజకీయాల్లో అలవోకగా పంచ్ ఇవ్వడం అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి కి వెన్నతో పెట్టిన విద్య. అందుకే తిరుపతిలో జరిగిన సభలో పవన్ ప్రసంగాన్ని ప్రస్తావించిన ఆయన... తనకు ఈ ఎంపీ పదవి వెంట్రుకతో సమానమని, రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే తనతో సహా ఎంపీలంతా రాజీనామాలకు సిద్ధమని చెప్పారు. ఎంపీలు రాజీనామా చేసినా కేంద్రానికి ఏమీ కాదని ఆయన పేర్కొన్నారు. తాను పుట్టకముందే తమకు వ్యాపారాలు ఉన్నాయని, అవి ఉన్నంత మాత్రాన కించపరిచేలా మాట్లాడడం తగదని జేసీ కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని జెసి అన్నారు. పవన్ కు వయస్సు, అనుభవం రెండూ తక్కువేనన్నారు. ఏపీకి హోదా తెస్తానంటే తామంతా సీఎం చంద్రబాబుకు చెప్పి పవన్ వెనుక నడుస్తామని జేసీ అన్నారు. మొత్తానికి పవన్ ని పొగిడేస్తూనే సుతిమెత్తగా చురకలంటించారు.

'చేతనైతే నువ్వు లీడ్ తీసుకో. నీ వెంట వస్తా. నేనే కాదు, ఎంపీలంతా వస్తారు. అంతేకాని లేని పోని మాటలు మాట్లాడవద్దు' అని దివాకర్ రెడ్డి స్పష్టం చేసారు. 'పార్లమెంటులో మేమంతా ఈ సమస్యపై పోరాడుతూనే ఉన్నాం. అటు చంద్రబాబు కూడా దీనిపై కేంద్రాన్ని నిలదీస్తూనే ఉన్నారు' అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:'దువ్వాడ జగన్నాధమ్' గా సరైనోడు

ఇవి కూడా చదవండి:హీరో విక్రమ్ అలవాట్లు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

English summary

Recently Power Star Pawan Kalyan conducted a meeting in Tirupathi and spoked about Special Status for Andhra Pradesh and Pawan Kalyan fired on TDP MP's also. Later That MP JC Diwakar Reddy gave counter attack to Pawan Kalyan by saying that Pawan Kalyan has no experience and knowledge about the things happening on Special Status to Andhra PRadesh.