ఫోటోకే పరిమితమా ?

JC Diwakar Reddy Meets Jagan

06:30 PM ON 24th February, 2016 By Mirchi Vilas

JC Diwakar Reddy Meets Jagan

ముక్కుసూటిగా మాట్లాడుతూ , ఎదుటి పక్షాన్నే కాదు స్వపక్షాన్నీ ఇరుకున పెట్టడంలో దిట్ట అయిన అనంతపురం జిల్లా అగ్ర నేత జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. సొంత పార్టీలో ఉన్న వాళ్లను తిట్టి పోయాలన్నా , ప్రత్యర్థి పార్టీలో ఉన్న వాళ్లను పొగడాలన్నా ఆయనకే చెల్లు. కాంగ్రెస్ లో వున్నప్పుడు ఎలా వున్నారో టిడిపి గూట్లో వున్నా ఈయన నైజం మారలేదు. మనసుకేమనిపిస్తే అది చేసేయ్యడం, ఏమనాలో అది అనేయడం జేసికి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈయన ఎన్ని ఎలా చేసినా, అందులో ఓ స్ట్రాటజీ ఉంటుంది. అందుకే ఆయన తత్త్వం తెల్సిన వాళ్ళు గాసిప్స్ కి చోటివ్వరు. ఓ వేళ అలాంటి వాటికి చోటు ఇస్తారేమోనని ముందే పసి గట్టి, జోక్ గా ముందే తీసి పారేస్తారు. అసలు విషయం ఏమంటే, జగన్ మీద ఈ మధ్య జేసీ తీవ్ర వ్యాఖ్యల్ని చేసారు. మరి ఇప్పుడు జగన్ తో ఫోటో దిగారు. గత వ్యాఖ్యల్ని బట్టి చూస్తే వీరి కలయిక ఆశ్చర్యం కలిగించేదే.

బుధవారం పార్లమెంటు సమావేశాలు మొదలైన సందర్భంగా పార్లమెంటు ఆవరణలో జగన్ జెసి దివాకరరెడ్డి ఎదురు పడ్డారు. ఆ సందర్భంగా ఇద్దరూ మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. అనంతరం జేసీనే పిలిచి మరీ.. జగన్ తో కలిసి ఫొటోలు దిగారు. ఐతే ఈ కలయిక ఏ ఊహాగానాలకు తెర తీస్తుందో అని అప్పుడే అప్రమత్తం అయిపోయిన జేసి అక్కడే ఉన్న మీడియాల్ని పిలిచి.. ఈ పలకరింపులు ఫొటోలు చూసి.. తాను వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరానని వార్తలు వేసేస్తారా ఏమిటి అంటూ అని చమత్కరించారు. ఇక బుధవారం జేసీ పుట్టిన రోజు కూడా కావడంతో ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పగా.. కృతజ్నతలు చెప్పిన జేసీ ముందు మీరు హ్యాపీగా ఉండండని వ్యాఖ్యానించారు. దీని భావమేమి మహాత్మా !

English summary

Today at Parliament TDP leader MP JC diwakar reddy meets Ysrcp President Y.S.Jagan in Delhi Parliament Bhawan.JC Diwakar Reddy takes photo with Jagan and joked on media.