వైసీపీ చెరువుకు గండి పడింది - చుక్క కూడా మిగలదు

Jc Diwakar Reddy Satires On Ysrcp

10:54 AM ON 29th April, 2016 By Mirchi Vilas

Jc Diwakar Reddy Satires On Ysrcp

ఎవరేమనుకున్నా తనకేమిటనే విధంగా , సెటైర్లు వేయడంలోనూ , సంచలన వ్యాఖ్యలు చేయడంలోనూ టిడిపి అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డి దిట్ట. తాజగా ఆయన జగన్ పార్టీ పై విరుచుకు పడ్డారు. వైసీపీ చెరువుకు గండి పడిందని, ఆ చెరువులో ఒక్క చుక్కయినా నీరు మిగలదని . దివాకర్ రెడ్డి అన్నారు. ఒకవేళ ఆ చెరువులో ఒక చుక్క నీరు కనిపించినా ఆ చుక్క జగనే అని సెటైర్లు వేశారు. చివరకు వైసిపిలో మిగిలేది జగన్ ఒక్కడేనని ఆయన జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గురువారం అమరావతి తాడిపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జె.సి.దివాకర రెడ్డి.. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. బాబు అనంతపురాన్ని కోనసీమలా మారుస్తున్నారని, బాబులాంటి ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరని, ఆయనకు ఎవరూ సాటి లేరని జేసి ఉన్నట్టుండి చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేసారు.

ఇవి కూడా చదవండి: మగాడ్ని రేప్ చేసి దాన్ని ఎత్తుకెళ్ళారు(వీడియో)

ఇవి కూడా చదవండి: మహేష్ అభిమానులకు దిమ్మ తిరిగే కానుక ఇచ్చిన పూరీ

English summary

TDP Ananthapuram MP Jc Diwakar redyy Setires on Ysrcp party he said that Ysrcp party was like leaked river. Jc Diwakar Reddy praised Andhra Pradesh Chief Minister Chandra Babu Naidu.