చంద్రబాబు ప్రధాని ఆవుతాడు...

Jc Diwakar Reddy Says Chandrababu Will Become PM

11:07 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

Jc Diwakar Reddy Says Chandrababu Will Become PM

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఎప్పుడూ ఏదో అంశం పై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ సొంత పార్టీ నేతలకే ఇబ్బంది కల్గించే జేసి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. దేశంలో జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని అన్నారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో చంద్రబాబు భవిష్యత్తులో ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు జగన్‌ పార్టీలో నేతలెవరూ ఉండరని జేసీ జోస్యం చెప్పారు. ఆ పార్టీ రంధ్రం పడిన జలాశయంలా తయారైందని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీ భారీ మెజార్టీ వస్తుందని వూహించలేక అక్కడక్కడా పొత్తులు పెట్టుకున్నారు. తీరా . ఎన్నికల్లో అనూహ్యంగా మెజారిటీ లభించడంతో స్వయం శక్తితో ఎదిగానని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశ అభివృద్ధి కుంటపడుతుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి కమ్యూనిస్టు పార్టీలకు మనుగడ ఉండదు. గెలిచే అవకాశాలు ప్రాంతీయ పార్టీలకే ఉంటాయి' అని జేసీ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

గుళ్ళో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న షకలక శంకర్

శాంతి కోరితే తల లేని మొండెంతో జవాబిస్తారా?

బుంగ మూతి కోసం పెరుగుతున్న ఆపరేషన్లు

English summary

Political Leader Jc Diwakar Reddy says that Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu Will Become Prime Minister in Upcoming Days . He says that no one will be there in Ysrcp Party in 2019 elections.