పాక్ పై యుద్ధం చేయాలంటూ జేసి షాకింగ్ కామెంట్స్!

Jc Diwakar Reddy shocking comments on Pakistan war

04:19 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Jc Diwakar Reddy shocking comments on Pakistan war

అనంతపురం ఎంపీఏ పార్టీలో వున్నా సరే, జేసీ దివాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ కి పెట్టింది పేరు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. తెలుగుదేశం పార్టీ ఎంపీగా వున్న ఈయన తాజాగా పాకిస్థాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పై భారత్ యుద్ధం ప్రకటించాలని, పాకిస్థాన్ ను స్వాధీనం చేసుకోవాలని ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేసారు. యుద్ధంలో 10 కోట్ల మంది ప్రజలు చనిపోయినా చింతలేదని, అఖండ భారత్ గా ఉంటేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రోజూ చచ్చి బతికే కన్నా యుద్ధమే శరణ్యమని జేసీ స్పష్టం చేసారు.

సైన్యానికి ఖర్చు పెట్టే వేల కోట్లతో దేశంలోని ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చునని జేసీ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ తప్పిదం వల్లే పాకిస్థాన్ ఏర్పాటయ్యిందని జేసీ దివాకర్ వ్యాఖ్యానించారు. అప్పటి నేతలు దూరదృష్టితో ఈ పరిస్థితిని ఊహించలేకపోయారని, ఇప్పుడైనా కేంద్రప్రభుత్వం ముందడుగు వేయాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కోరారు. మొత్తానికి జేసి వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

ఇది కూడా చదవండి: రాజమౌళికి షాక్: 'బాహుబలి 2' కి కూడా ఈ గండం తప్పలేదు.. స్టోరీ మొత్తం లీక్ చేసేశారు!

ఇది కూడా చదవండి: పని ఉందంటూ స్టూడెంట్ ని ఇంటికి తీసుకెళ్లి కోరిక తీర్చుకున్న టీచర్.. ఆపై..

ఇది కూడా చదవండి: ఈ ఆహార పదార్ధాలు కలిపి తింటే మీ ప్రాణాలకే ప్రమాదం!

English summary

Jc Diwakar Reddy shocking comments on Pakistan war