మోడీకి చంద్రబాబంటే భయం భయం...

JC shocking comments on Narendra Modi

12:07 PM ON 1st August, 2016 By Mirchi Vilas

JC shocking comments on Narendra Modi

ఇదేమిటి అనుకుంటున్నారా? నిజమట. ఎవరో చెబితే నమ్మలేం కానీ, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరైన అనంతపురం టీడీపీ ఎంపీ జే.సీ.దివాకర రెడ్డి చెబితే మాత్రం నమ్మాలనిపిస్తుంది. ఇంచుమించు ఆయన వ్యాఖ్యలు వాస్తవానికి, భవిష్యత్తుకి దగ్గరలో వుంటాయని అంటూంటారు కదా. ఏపీకి ప్రత్యేక హోదా రాదనీ తేల్చిచెప్పేసాక నిరసనలు ఊపందుకున్నాయి. ఈనేపధ్యంలో దివాకర్ రెడ్డి నోరు విప్పారు. ఆయన విజయవాడలో మీడియాతో టీడీపీ-బీజెపీ మైత్రికి ఇక కాలం చెల్లిందన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రెండు పార్టీలూ విడిపోతే మంచిదని కూడా దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతటితో ఊరుకోలేదు, ప్రధాని మోడీకి చంద్రబాబు శత్రువులా కనబడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేది చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రమేనని, అందుకే వీళ్లద్దరూ అంటే మోడీకి భయం అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఉద్ధేశం బీజెపీకి లేదని, అందుకే ఈ అంశం నుంచి ఆ పార్టీ తప్పించుకుంటోందని జేసి ఆరోపించారు. హోదా ఇవ్వదలచుకుంటే మోడీకి నిబంధనలు అడ్డు రావని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రాంతీయ పార్టీల సహకారం ఎంతయినా అవసరమని దివాకర రెడ్డి పేర్కొన్నారు. బీజెపీకి టీడీపీ దూరం కావాలని తాను ఏడాది క్రితమే చంద్రబాబుకు సూచించానని చెప్పారు.

English summary

JC shocking comments on Narendra Modi