వర్మ హీరోయిన్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న జెడీ చక్రవర్తి!

JD Chakravarthy married secretly Anukriti Sharma

12:56 PM ON 19th August, 2016 By Mirchi Vilas

JD Chakravarthy married secretly Anukriti Sharma

'గులాబి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జెడీ చక్రవర్తి ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాల్లో ఎక్కువగా నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే జెడీ చక్రవర్తికి రామ్ గోపాల్ వర్మ మంచి లైఫ్ ఇచ్చాడనే చెప్పాలి. ఇదిలా ఉంటే జెడీ చక్రవర్తి ఇంతకాలం బ్రహ్మచారిగానే జీవితం నెట్టుకొచ్చాడు. కెరీర్ పైనే దృష్టి పెట్టిన జెడీ.. ఎప్పుడూ.. పెళ్లిపైన దృష్టి పెట్టలేదు. 46 యేళ్ల వయసొచ్చినా.. స్టిల్ బాచిలర్ గానే లైఫ్ ని సాగించేసాడు. అయితే ఇలా ఇన్నాళ్లు బాచిలర్ గా ఎంజాయ్ చేసిన జెడీకి.. ఉన్నట్టుండి పెళ్లి గుర్తొచ్చినట్లుంది. హఠాత్తుగా, సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నాడు.

ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త కూతురుతో జెడీ వివాహం జరగనుందంటూ ఇంతకు ముందు వార్తలు ఎన్నో వచ్చినా, చివరకు ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ జెడీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేగా మీ ప్రశ్న? మొన్నామధ్యన రామ్ గోపాల్ వర్మ చిత్రం శ్రీదేవి సినిమా అంటూ హాట్ హాట్ గా ఫోటోలు వచ్చాయిగా.. ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా పాప అనే సినిమా కోసం గొడవపడి కాంట్రవర్శీ అయిన హీరోయిన్ అనుకృతి శర్మే. ఆ హాట్ హీరోయిన్ నే జెడీ చక్రవర్తి పెళ్లి చేసుకున్నాడు.

1/4 Pages

జెడీ చక్రవర్తి తన వివాహాన్ని ఎటువంటి అట్టహాసం లేకుండా చేసుకున్నాడు. రెండు కుటుంబాల వాళ్లు తప్ప మరెవ్వరని ఈ వివాహానికి పిలవలేదు. ముఖ్యంగా ఈ వివాహానికి మీడియాను దూరం పెట్టారు..

English summary

JD Chakravarthy married secretly Anukriti Sharma