కారును ఓవర్ టేక్ చేసిన వ్యక్తిని చంపేసిన ఎమ్మెల్సీ కొడుకు

JDU MLC Manorama Devi Son Kills For Overtaking His Car

12:40 PM ON 9th May, 2016 By Mirchi Vilas

JDU MLC Manorama Devi Son Kills For Overtaking His Car

మనిషి ప్రాణం తీయడం చాలా ఈజీ అయిపొయింది. పెద్ద కారణం లేకున్నా, చిన్న చిన్న విషయాలకు హీరిటేట్ అయిపోయి ప్రాణాలు తీసేస్తున్నారు. డబ్బు , అధికారం కొందరికి కన్నూ మిన్నూ కానరావడంలేదు. పవర్ నెత్తికి ఎక్కితే ఎంత దారుణ పరిస్థితులు చోటు చేసుకుంటాయనటానికి తాజా ఉదంతం ఇది. బీహార్ కు చెందిన ఒక ఎమ్మెల్సీ పుత్రరత్నం ఘనకార్యం ఇప్పుడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. నితీష్ సర్కారుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. బీహార్ అధికారపక్షమైన జేడీయూకి చెందిన ఓ ఎమ్మెల్సీ కుమారుడు చేసిన ఓవర్ యాక్షన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది.

ఇవి కూడా చదవండి:మూడు గంటలు పాటు ముద్దు పెట్టించుకున్న కాజల్

తన కారును ఓవర్ టేక్ చేసిన వ్యక్తిపై ఆగ్రహించిన ఎమ్మెల్సీ కుమారుడు రాకీ కుమార్ యాదవ్.. తన దగ్గరున్న పిస్టల్ తో వాహనాన్ని ఓవర్ టేక్ చేసిన వ్యక్తిని కాల్చి చంపటం సంచలనంగా మారింది. గయ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేశి కుమారుకి అమ్మ పవర్ బాగానే నెత్తికి పట్టినట్లుంది. లేకపోతే తన కారును ఓవర్ టేక్ చేసిన 20 ఏళ్ల యువకుడితో గొడవ పెట్టుకున్న ఎమ్మెల్సీ కుమారుడు.కోపంతో ఊగిపోతూ తన దగ్గరున్న పిస్టల్ కి పని చెప్పేసాడు. సదరు యువకుడి మీద కాల్పులు చేయటంతో.. ఆ కుర్రాడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తాజా ఘటన నేపథ్యంలో రాకీ తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పుత్రరత్నం కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు కారణమైన నేతలపైనా బీహార్ అధికారపక్షం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:11 అంతస్తుల పై నుండి దూకాడు.. కానీ ఏమీ కాలేదు(వీడియో)

ఇవి కూడా చదవండి:17 ఏళ్లుగా మేడలో వున్న బులెట్ తొలగింపు

ఇవి కూడా చదవండి:మీరు ప్రాణాలతో తిరిగి రావాలంటే అక్కడకు వెళ్లొద్దు( వీడియో)

English summary

JDU MLC Manorama Devi Son Named Raki Yadav klls a young boy for Overtaking his car. Raki Yadav fired the Young Guy b Using Pistol. Police filed case on this incident and Searching for him.