మగ బిడ్డ పుట్టాడని ఓర్వలేక పసిగుడ్డును విసిరేసింది ...

Jealous woman throws infant off hospital roof

10:44 AM ON 7th September, 2016 By Mirchi Vilas

Jealous woman throws infant off hospital roof

ఇది అందరి హృదయాలనుఁ కలచివేసే దారుణం. అభివృద్ధి చెందామో, తిరోగమనంలో ఉన్నామో ఈ ఘటన చూస్తే అర్ధం అవుతుంది. లేకపోతే 18 రోజుల పసిగుడ్డును రెండస్థుల భవనంపై నుంచి విసిరేయడమా? ఈ ఘటన కలకలం రేపింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో జరిగిందీ దారుణం. సరిత యాదవ్ అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు. అయితే ఆమె బంధువు ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. తనకు మగ పిల్లలు లేకుండా, వేరేవాళ్లకు మగబిడ్డ పుట్టడాన్ని ఓర్చుకోలేకపోయిన సరిత, ఆ బాలుడ్ని ఆసుపత్రిలోని రెండో అంతస్థులో ఉన్న కిటికీ నుంచి కిందకు విసిరేసింది. తల్లి శిశువుకు పాలివ్వడానికి ఒక అలారమ్ ఏర్పాటు చేసుకుంది. అలారమ్ మోగగానే తన శిశువు కోసం చూసుకునే సరికి, తన పక్కన ఆ బిడ్డ లేకపోవడంతో విషయం బయట పడింది. దీనికి సంబందిచిన పూర్తి వీడియో ఆసుపత్రి సీసీ కెమెరాలో రికార్డు అయింది.

ఇది కూడా చూడండి: ఇల్లరికపు అల్లుడి లైంగిక దాడి తట్టుకోలేక భార్య ఏం చేసిందో తెలుసా

ఇది కూడా చూడండి: ఛీ ఛీ ... ఆ ఎంపీ కాల్ బాయ్స్ తో రాసలీలలు

English summary

Woman feeling jealous she threw away baby from building in Kanpur.