జెట్ మెన్స్ - మానవ విమానాలు

Jet pack-Flying Stuntmen Race Alongside Jumbo

07:12 PM ON 7th November, 2015 By Mirchi Vilas

Jet pack-Flying Stuntmen Race Alongside Jumbo

సూపర్ మ్యాన్, బాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ .. ఇండియా వరకు వచ్చేసరికి లేటెస్ట్ ట్రెండ్ రోబో, క్రిష్, రా వన్ .. వీళ్ళంతా సినిమా హీరోలు. కానీ దుబాయ్ లో రియల్ లైఫ్ హీరోలు ఉన్నారు . వీళ్ళు విమానాలతో సమానంగా వేల అడుగుల ఎత్తులో ఏ మాత్రం భయం లేకుండా చక్కర్లు కొడుతున్నారు . ఆకాశం లో సాహసాలు చేస్తూ .. వావ్ అనిపిస్తున్నారు. దుబాయ్ కి చెందిన యవెస్ రోస్సి, విన్స్ రేఫ్ఫేట్ లు చిన్న చిన్న జెట్ విమానాలలో పనిచేస్తున్నారు. అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఏదో ఒక సాహసం చేయాలనుకున్న వీరిద్దరూ .. పామ్ జునే రిహ నగరం నుంచి దుబాయ్ వెళ్ళే ఏ 380 జెట్ విమానం తో పాటుఆకాశం లో 4000 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేసారు. విమానానికి ఇరు ప్రక్కల వీరు చేసిన విన్యాసాలు.. వళ్ళు గగుర్పొడిచే విధంగా ఉండి అందరిని ఆశ్చర్య పరిచాయి. వీరి అద్భుత విన్యాసాలు ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టు కుంటున్నాయి .

English summary

Jet pack-Flying Stuntmen Race Alongside Jumbo