మహేష్ బాబుని ఛీకొట్టిందా.. లేక కాదందా..!

Jhanvi Kapoor rejected Mahesh Babu movie

04:44 PM ON 30th July, 2016 By Mirchi Vilas

Jhanvi Kapoor rejected Mahesh Babu movie

ప్రిన్స్ మహేష్ బాబుకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎంతో మంది హీరోయిన్లు మహేష్ సరసన నటించాలని కలలు కంటారు.. అలాంటి మహేష్ సరసన నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఎందరో హీరోయిన్లు ఈ మాటను చెప్పారు కూడా. అయితే మహేష్ బాబు-ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా.. ఆ అరుదైన ఛాన్స్ ను చేజార్చుకుందట ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ. బోనీకపూర్, శ్రీదేవి దంపతులు ఇప్పటికే జాన్వీని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టిన నేపథ్యంలో..

జాన్వీ ఎంట్రీ మహేష్ సినిమాతో అయితే బావుంటుందని మురుగదాస్ శ్రీదేవికి సూచించారట. అయితే మహేష్ సినిమాకు శ్రీదేవి ఓకే చెప్పినా జాన్వీ మాత్రం నటనలో పూర్తి శిక్షణ తీసుకున్న తర్వాతే ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. జాన్వీ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లోని ప్రతిష్టాత్మక థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో డ్యాన్స్ మరియు నటనలో శిక్షణ తీసుకుంటోంది. ఇంత పెద్ద ఆఫర్ ని వదులుకుని శిక్షణ తీసుకుంటుంది అంటే... అది ఎంత వరకు కలిసొస్తుందో వేచి చూడాలి...

English summary

Jhanvi Kapoor rejected Mahesh Babu movie