ఆ యువతిని తాళ్లతో కట్టేసి ఎందుకు తీసుకెళ్లారంటే(వీడియో)

Jharkand police ties up a girl and takes to police station

12:08 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Jharkand police ties up a girl and takes to police station

వరకట్న వేధింపుల కేసులో నింధితురాలిగా ఉన్న 23 ఏళ్ల యువతిని పోలీసులు తాళ్లతో కట్టి స్టేషన్ కు తరలించారు. అయితే ఆ యువతిని తాళ్లతో ఎందుకు కట్టారు? ఆమెను కట్టేసి తరలించడం పై మహిళల సంఘాలు మండిపడ్డాయి. ఇది ముమ్మాటికీ హక్కులకు భంగం కలిగించడమేనంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అసలేం జరిగిందంటే.. జార్ఖండ్ లోని గర్హ జిల్లాలో అపర్ణ ఫ్యామిలీ వరకట్నం పేరుతో టార్చర్ చేస్తోందంటూ ఆమె వదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అపర్ణ ఇంటికి వెళ్లారు.

ఆ టైమ్ లో పేరెంట్స్ ఇంట్లో లేకపోవడంతో ఆమెని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుని ఎస్కేప్ అయ్యింది. ఈసారి పోలీసులు పక్కాగా ప్లాన్ చేసి ఆమెని అరెస్ట్ చేసి తాళ్లతో కట్టి స్టేషన్ కు తీసుకెళ్లారు. జీన్ ప్యాంట్, టీ షర్ట్ లోవున్న సదరు యువతిని తాళ్లతో కట్టి పోలీసులు తీసుకెళ్లడాన్ని స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు. ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేశారు. నేరస్తులకు సంకెళ్లేయడం, తాళ్లతో బంధించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని,

ఓ వైపు సర్వోన్నత న్యాయస్థానం నెత్తినోరు బాదుకుంటున్నా జార్ఖండ్ పోలీసులు ఈ దాష్టీకానికి పాల్పడటం గమనార్హం అంటూ పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు.

English summary

Jharkand police ties up a girl and takes to police station