బిజెపి నేత ఇంట 'బాల్య వివాహం’..షాకింగ్ న్యూస్

Jharkhand BJP Chief Son Married Minor Girl

10:35 AM ON 1st July, 2016 By Mirchi Vilas

Jharkhand BJP Chief Son Married Minor Girl

బాల్య వివాహాలు అనాచారంగా పేర్కొంటూ ఉత్తరాదిన రాజా రామ్ మోహన్ రాయ్, దక్షిణాదిన కందుకూరి వీరేశలింగం పంతులు ఉద్యమించి, సంస్కరణలు తెస్తే, మళ్లీ ఆ జాడలు కనిపిస్తూనే వున్నాయి. పైగా ఇలాంటి బాల్య వివాహాలు ఎక్కడో సాధారణ పౌరుల ఇంత కాదు .. పేరుమోసిన రాజకీయ నేత ఇంట జరిగితే ఏమనాలి.. ఎవరిని అనాలి. ఇంతకీ విషయంలోకి వెళ్తే, జార్ఖండ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు టలా మరాండీ కొడుకు చేసిన ఇలాంటి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. సుమారు 18 ఏళ్ళ వయస్సువాడైన మున్నా మరాండీ అనే ఇతగాడు ఈ మధ్య గొడ్డా ప్రాంతంలో 11 ఏళ్ళ మైనర్ బాలికను బాల్య వివాహం చేసుకున్నాడు. ఆమె ఆరో తరగతి చదువుతోంది. ఈ పెళ్లి రిసెప్షన్ బుధవారం జరిగిందని, జార్ఖండ్ సిఎం రఘువర్ దాస్ ఈ రిసెప్షన్ కు అటెండ్ కావలసి ఉన్నప్పటికీ వివాదం రేగుతుందని భావించి చివరి నిముషంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాడని తెలిసింది.

తన కొడుకు చేసిన ఘన కార్యం పై మాట్లాడేందుకు టలా మరాండీ నిరాకరించాడు. తన తనయుడు పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి వయసెంతో ఆమె తల్లినే అడగండి అంటూ దాటవేశాడు. ఈ పెళ్లి తంతు అంతా దాదాపు సీక్రెట్ గా జరిగిపోయిందని జార్ఖండ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ అన్నారు. కాగా..మున్నా మామూలోడు కాదట.. వీడు పెళ్లి చేసుకుంటానని మభ్య పెడుతూ రెండేళ్ళ పాటు ఓ మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించాడట.. ఈ బిజెపి చీఫ్ మరాండీ పైన అతని కొడుకుపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ప్రధాని మోడీ ఎంత నిబద్ధతతో వున్నా, ఇలాంటి ఘటనలు దెబ్బతీయడం ఖాయమని బిజెపి శ్రేణులే అంటున్నారు. హతవిధీ అనడం తప్ప ఏమి చేయగలం అని కొందరు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:దేశాధ్యక్షుడు చెప్పాడని నగ్నంగా పనిచేస్తున్నారు (ఫొటోస్)

ఇవి కూడా చదవండి:నిమిషానికి క్రికెటర్ల సంపాదన తెలిస్తే షాకే

English summary

Child Marriages were prohibited in India but there were some places in India there were still Child marriages were still going on. Recently Jharkhand BJP chief son married a 11 year minor girl and Women Commission were opposed this thing.