'జియాఖాన్' మరణానికి అసలు కారణం!!!!

Jiah Khan death Mystery

11:36 AM ON 12th December, 2015 By Mirchi Vilas

Jiah Khan death Mystery

రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'నిశబ్ద్‌' చిత్రంలో అమితాబచ్చన్‌ సరసన హీరోయిన్గా నటించిన జియాఖాన్ 2013లో హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుని అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఇది ఆత్మహత్య లేక హత్య అనేది సీబీఐ ని దర్యాప్తు చెయ్యమని 2014 లో ముంబై హైకోర్ట్‌ ఆదేశించింది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఆఫీసర్లు జియాఖాన్ ఆత్మహత్య వెనుకాల దాగున్న అసలు రహస్యాన్ని చేధించారు. జియాఖాన్ ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణం తన ప్రియుడైన సూరజ్‌ పంచోలీ. అసలేం జరిగిందంటే జియాఖాన్-సూరజ్‌ పంచోలీ శారీరకంగా దగ్గరవ్వడంతో జియాఖాన్ గర్భవతి అయింది.

తను నాలుగు వారాల గర్భిణి గా ఉన్నప్పుడు పంచోలీకీ ఫోన్‌ చేసి విషయం చెప్పింది. అయితే తమ బంధం ఎక్కడ బయట పడుతుందో అని పంచోలీ జియాఖాన్ ని ఒక వైద్యుడు దగ్గరకి తీసుకెళ్లి తన గర్భం పోవడానికి డాక్టర్‌ని ట్యాబ్లెట్స్‌ రాసిమ్మన్నాడు. దీనితో డాక్టర్‌ ఒక ప్రిస్క్రిప్‌షన్ రాసిచ్చాడు. కానీ ఆ మందులు గర్భం పోవడానికి ఉపయోగపడలేదు. దీనితో పంచోలీకి భయమేసి జియాఖాన్ ని ఒక గైనకాలజిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ గైనకాలజిస్ట్‌ ఎక్కువ పవర్‌ ఉండే ట్యాబ్లెట్స్‌ రాసిచ్చాడు. అవి వాడిన జియాఖాన్ కి విపరీతమైన నొప్పి రావడం మొదలైంది. ఈ విషయం పంచోలీకి ఫోన్‌ చేసి చెప్పింది జియా.

ఆ నొప్పి తగ్గించాలంటే జియాఖాన్‌ కి హాస్పటల్‌ లో వైద్యం చెయ్యవలసిన అవసరం ఏర్పడింది. కానీ తమ బంధం ఎక్కడ వైద్యుల ద్వారా మీడియాకి తెలిసిపోతుందో అని పంచోలీనే జియాఖాన్‌ గర్భంలో ఉన్న పిండాన్ని తొలగించి ఆ పిండాన్ని తన టాయిలెట్‌లో పడేశాడు. ఇదే విషయాన్ని సీబీఐ ఆఫీసర్లు ముంబై హై కోర్టులో చార్జ్‌షీట్‌ ద్వారా తెలియజేశారు. ఈ వార్త భయటకి రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

English summary

Jiah Khan death Mystery. Sooraj Pancholi removed Jiah Khan pregnancy and throw into the his toilet.