అంబానీ బర్త్ డే నాడు.. జియో సంచలన ఆఫర్?!

Jio sensational offer

11:19 AM ON 29th November, 2016 By Mirchi Vilas

Jio sensational offer

అధికారంకై అన్నదమ్ముల పోటీ అంటూ ఓ పాటలో సినీ కవి ప్రస్తావించాడు కదా. కానీ వ్యాపారంలో ఈ అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. అందుకే సంచలనాలకు కేరాఫ్ గా మారింది జియో టెలికాం. ఫ్రీ కాలింగ్ ఆఫర్ తో టెలికాం సెక్టార్ లో జియో అలజడితో ఇతర కంపెనీల షేర్లు మార్కెట్లో కుదేలయ్యాయి. దీనిదాటికి ఆత్మరక్షణలో పడిన కొన్ని కంపెనీలు చివరకు దిగిరాక తప్పలేదు. ఈ క్రమంలో టెలికాం కంపెనీలు ప్రత్యక్షంగా జియోపై మాటల యుద్ధానికి దిగాయి.. ఆ తర్వాత ట్రాయ్ కి ఫిర్యాదు చేయడం కూడా అయింది. అయితే, ఈ ఆఫర్ ను మరో మూడు నెలలపాటు(2017 మార్చి వరకు) పొడిగించింది జియో. లేటెస్ట్ గా ఈ ఆఫర్ ను ఏడాదిపాటు పొడిగించే యోచనలో జియో ఉన్నట్లు ఆన్ లైన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

1/3 Pages

డిసెంబర్ 28న ధీరూభాయ్ అంబానీ బర్త్డే సందర్భంగా ఈ బంపర్ ఆఫర్ ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. ఇప్పుడున్న ఉచిత సర్వీస్ తోపాటు వెల్ కమ్ ఆఫర్- 2017 ఏడాది చివరి వరకు ఇచ్చే ఛాన్స్ వున్నట్లు షికార్లు చేస్తున్నాయి. నిజంగా జియో నుంచి ఈసారి సంచలన ప్రకటన ఉంటుందా? లేదా అన్నవిషయం తెలియాలంటే డిసెంబర్ 28 వరకు వెయిట్ చెయ్యక తప్పదు మరీ! ఒకవేళ అలాంటి ప్రకటనొస్తే గనుక, ఈసారి మాత్రం మిగతా కంపెనీలు తేరుకోవడం కష్టమనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

English summary

Jio sensational offer