రేప్ లకు అడ్డాగా మారిన జోధ్ పూర్ నగరం!

Jodhpur turned as a rapes city

02:19 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Jodhpur turned as a rapes city

రాజుల కోట, పర్యాటక ప్రాంతం అయిన జోధ్ పూర్ రేప్ ల నగరంగా మారిందా? అంటే అవుననే లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ మహిళలపై అత్యాచారాలు దేశ రాజధాని ఢిల్లీలోనే ఎక్కువని తెలుసు. కానీ, రాజస్థాన్ లోని ప్రముఖ పట్టణం జోధ్ పూర్ ఇప్పుడు అత్యాచారాల రాజధానిగా మారిందట! సగటున లక్ష మంది జనాభా తీసుకుంటే అత్యాచారాలు ఎక్కువగా నమోదవుతున్నది ఇక్కడేనట. ఇండియాస్పెండ్ తాజా సర్వేలో ఈ విషయం వెల్లడయింది. 2015 నేర గణాంక లెక్కల ప్రకారం ఢిల్లీలో 1,893 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీని ప్రకారం సగటున రోజుకు ఢిల్లీలోని ఏదో ఒక ప్రాంతంలో ఐదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయి.

1/3 Pages

వీటితో పోల్చుకుంటే రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో అత్యాచారాల సగటు ఎక్కువగా ఉండడం గమనార్హమని ఇండియాస్పెండ్ పేర్కొంది. అత్యాచారాల సగటులో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచిందని, రాయ్ పూర్ మూడోస్థానంలో ఉందని పేర్కొంది. ఇక 2014 నేర గణాంకాలతో పోల్చుకుంటే గ్వాలియర్ నగరం అత్యాచారాల్లో ముందు ఉండడం గమనార్హం. అయినప్పటికీ.. అప్పుడు కూడా ఢిల్లీలోనే అత్యాచారాల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కాగా, 2012 నిర్భయ ఉదంతం తర్వాత అత్యాచారాలపై ఉక్కుపాదం మోపుతామన్న ప్రభుత్వాల మాటలు నీటి మూటలుగా మిగిలాయని ఇండియాస్పెండ్ తేల్చిచెప్పింది.

English summary

Jodhpur turned as a rapes city