ఉమేద్ భవన్.. వరల్డ్ బెస్ట్ హోటల్‌

Jodhpur Umaid Bhawan Palace As Worlds Best Hotel

10:20 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Jodhpur Umaid Bhawan Palace As Worlds Best Hotel

ప్రపంచంలో అత్యుత్తమ హోటల్ ఏది..? ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే ఏ అమెరికా , బ్రిటన్ హోటల్ పేరో చెపుతాం కదా.. ఇందులో ఇండియా ప్రస్తావనే సామాన్యంగా తీసుకురాం. కానీ ప్రపంచంలో అత్యుత్తమమైన హోటల్ ఇండియాలోనే ఉందట. మీరు నమ్మలేకపోతున్నా ఇది నిజం. ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్‌గా జోద్‌పూర్‌(రాజస్థాన్‌)లోని ఉమేద్‌ భవన్‌ రికార్డులకెక్కింది. ప్రముఖ ట్రావెల్‌ వెబ్‌సైట్‌ ట్రిప్‌ అడ్వైజర్‌ నిర్వహించిన సర్వేలో ఉమేద్‌ భవన్‌ ఈ అవార్డు కైవశం చేసుకుంది. సంవత్సరం పాటు ట్రిప్‌ అడ్వైజర్‌ పర్యాటకుల అనుభవాలను, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుకొని ఈ సర్వేను నిర్వహించినట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం పేర్కొంది. ఈ వెబ్‌సైట్‌ ప్రారంభమై 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సర్వేలో ఈ హోటల్‌ ‘విన్నర్స్‌ ఆఫ్‌ ది ట్రావెలర్స్‌’ అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా తాజ్‌ హోటల్స్‌ చీఫ్‌ రెవెన్యూ అధికారి చిన్మయి శర్మ మాట్లాడుతూ ఈ విజయాన్ని భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు.

English summary

Umaid Bhawan Palace Which was in Jodhpur was selected as the worlds best hotel for the year 2016 across the world.A website named Trip Adviser conducted a survey on this and Umaid Bhavan Palaca got "Winners Of Travellers Award"