తల్లిని కావాలనుటుకుంటున్న ఎవరైనా ఆ సాయం చెయ్యరూ....

Jodie Marsh looking for sperm donor

03:15 PM ON 1st July, 2016 By Mirchi Vilas

Jodie Marsh looking for sperm donor

ఓ బ్రిటీష్ మోడల్ ఓ వింత కోరికను కోరి ప్రస్తుతం ఇంటర్నెట్ లో బాగా హల్ చల్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఏ కోరిక కోరిందో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. ఆ వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ కు చెందిన జోడీ మార్ష్ అనే 37 ఏళ్ల మోడల్.. తనకు తల్లి కావాలనుందని తన మనసులో మాట చెప్పింది. ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? అయితే ఇక్కడే చిన్న మెలిక ఉంది. అదేంటంటే.. ఈ హాట్ మోడెల్ కి మగాడి అవసరం లేకుండానే తల్లినవ్వాలనుందట. ఎవరైనా శుక్రకణాలు దానం చేస్తే.. వాటి ద్వారా తల్లిని అవ్వొచ్చని జోడీ మార్ష్ తెలిపింది. తల్లి కావడం తనకెంతో ఇష్టమని.. అది కేవలం శృంగారం ద్వారా మాత్రమే కానవసరం లేదని చెప్పింది.

భర్త జేమ్స్ ప్లాసిడో నుంచి విడిపోయి చాలా సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న ఆమె.. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం చెప్పింది. 'నేను శృంగారాన్ని కోరుకోవచ్చేమో.. కానీ నేను సెక్స్ చేయను' అంటూ ఇన్ స్టాగ్రమ్ ద్వారా తెలిపింది. గత నాలుగేళ్లుగా శృంగారానికి దూరంగా ఉన్నానని, తన జీవితంలో చేసిన అతి పెద్ద మంచి పని ఇదేనని జోడీ మార్ష్ పేర్కొంది. సర్వం త్యజించి ఉండటం అంటే తనకెంతో ఇష్టమని, గౌరవంగా కూడా అనిపిస్తుందని చెప్పింది. అయితే.. తానెందుకు శృంగారన్ని కోరుకోవడం లేదు? ఎందుకు ఓ పురుషుడి తోడు అవసరం లేదు? శుక్రకణాల దాత ద్వారానే ఎందుకు తల్లి కావాలనుకుంటోంది? అనే విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వాటిపై ఒక్కొక్కొటిగా మళ్ళీ ఎప్పుడైనా వివరణ ఇస్తానని జోడీ మార్ష్ తెలిపింది.

English summary

Jodie Marsh looking for sperm donor