బాబు గారి పై మరోసారి విరుచుకుపడిన జోగయ్య

Jogaiah fires on ChandraBabu Naidu

03:04 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Jogaiah fires on ChandraBabu Naidu

అప్పుడప్పుడు తెరమీదికి వచ్చి కత్తిలాంటి మాటలతో వార్తలకెక్కే సీనియర్ పొలిటీషియన్ చేగొండి హరిరామ జోగయ్య మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసారు. అది కూడా చంద్రబాబుపైనే. ఆ మధ్య జోగయ్య రాసిన పుస్తకంలో రంగా హత్యను ప్రస్తావిస్తూ, చంద్రబాబు కనుసన్నల్లోనే రంగా హత్య జరిగిందని ఆరోపించారు. అప్పట్లో జోగయ్య రాసిన ఆ పుస్తకం తీవ్ర అలజడి రేపింది. చంద్రబాబు కూడా ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు మరోసారి ఆ అంశాన్ని జోగయ్య లేవనెత్తారు. అది కూడా ముద్రగడ పద్మనాభం దీక్ష నేపధ్యంలో కావడం విశేషం. ఈ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరును జోగయ్య తప్పుపట్టారు.

చంద్రబాబును కాపులు ఎట్టి పరిస్థితిలోనూ క్షమించరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో టీడీపీ మనుగడకు అడ్డుగా ఉన్నాడనే ఉధ్దేశ్యంతో వంగవీటి రంగాను హత్య చేశారని.. అందుకు కారణభూతుడు చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ముద్రగడ విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారని జోగయ్య అంటున్నారు. రంగా హత్య నాటి పరిస్థితులు పునరావృతమైతే చంద్రబాబును కాపులు వదిలిపెట్టరని జోగయ్య హెచ్చరించారు. అదే సమయంలో ఆయన టీడీపీ మంత్రుల ఆరోపణలనూ తిప్పకొట్టారు. కాపుల్లో అధిక శాతం మంది ముద్రగడ డిమాండును సమర్థిస్తున్నారని అన్నారు.

తుని విధ్వంసం పేరుతో కాపులను అరెస్టు చేసి ఆ వర్గంలో భయాందోళనలు రేపుతున్నారని జోగయ్య ఆరోపించారు. మొత్తానికి ఇప్పుడు మరోసారి జోగయ్య పాత ఆరోపణలు బయటకు తీయడం కలకలం రేపుతోంది.

English summary

Jogaiah fires on ChandraBabu Naidu