రిలాక్స్ కోసం బెల్లీ డాన్సర్లతో ఎంజాయ్ చేస్తున్న హీరో

Johnny Depp relaxing with belly dancers

12:46 PM ON 24th June, 2016 By Mirchi Vilas

Johnny Depp relaxing with belly dancers

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు కదా. ఇక్కడ ఆ హీరోకి ఎన్ని ఇబ్బందులున్నా రిలాక్స్ కావాలంటే, కొదవ లేదంట. అందుకే విడాకుల వ్యవహారంతో విసిగిపోయిన హాలీవుడ్ హీరో జానీ డెప్(53) రిలాక్స్ కోసం రొమేనియా వెళ్లాడు. ఫ్రెండ్స్ తో ప్రైవేటు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ, అందాల భామల బెల్లీ డాన్స్ చూస్తూ గడిపాడని స్థానిక మీడియా వెల్లడించింది. తన భార్యను హింసించినట్టు జానీ డెప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన కంటే 22 ఏళ్లు చిన్నదైన అంబర్ హార్డ్ ను 2015లో పెళ్లి చేసుకున్నాడు.

అంబర్ ను చిత్రహింసలకు గురిచేయడంతో జాన్ డెప్ నుంచి ఆమె విడాకులు తీసుకుంది. అయితే అతడు ఒత్తిడిలో ఉన్నట్టు కనబడలేదని పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి తెలిపాడు. బీర్ తాగుతూ రిలాక్స్ అయ్యాడని చెప్పాడు. ఫెండ్స్ తో కబుర్లు చెప్పినప్పడు తన మాజీ భార్య అంబర్ హార్డ్ గురించి చాలా తక్కువగా మాట్లాడాడని వెల్లడించాడు. అందరినీ గుడ్డిగా నమ్ముతాను. అదే నాకు సమస్యలు తెచ్చిపెడుతోందని తనతో జానీ డెప్ అన్నాడని రెస్టారంట్ యజమాని పేర్కొన్నాడు.

English summary

Johnny Depp relaxing with belly dancers