పౌడర్ వాడుతున్నారా.. అయితే జాగ్రత

Johnson & Johnson to pay 72Million Dollars

05:58 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Johnson & Johnson to pay 72Million Dollars

మనం ప్రతిరోజు ఫేస్ పౌడర్ వాడుతూ ఉంటాం కదా.. అయితే ఈ పౌడర్ విషయంలో ఇకపై మనం కాస్త జాగ్రత్త వహించాల్సిందే. లేదంటే జబ్బుల బారిన పడాల్సి రావచ్చు. ఎందుకంటే.. ప్రముఖ బ్యూటీ ప్రొడక్ట్ తయారీ సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టాల్కమ్ పౌడర్ వాడటం వల్ల ఓ మహిళ క్యాన్సర్ బారిన పడిందట. దీంతో ఓ అమెరికా న్యాయస్థానం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ జరిమానా విధించింది. బ్రిమింగం ప్రాంతానికి చెందిన ఫాక్స్‌(62) అనే మహిళ మూడేళ్ల క్రితం అండాశయానికి సంబంధించిన క్యాన్సర్‌తో మృతిచెందింది. ఆమె గత 35 ఏళ్లుగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి చెందిన టాల్కమ్‌ పౌడర్‌ని వినియోగించింది. ఈ ఫౌడర్‌ కారణంగానే ఆమెకు ఓవేరియన్‌ క్యాన్సర్‌ సోకిందని ఆమె కుటుంబసభ్యులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. మహిళ మృతికి కారణమైనందుకు కంపెనీ మృతురాలి కుటుంబసభ్యులకు 72మిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు పట్ల జాన్సన్ అండ్ జాన్సన్ అసహనం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పుపై ఉన్నతన్యాయస్థానానికి వెళ్లనున్నట్లు చెప్పారు.

English summary

St. Louis jury found Johnson & Johnson liable for Jackie Fox's ovarian cancer, which she claimed in the lawsuit was the result of using the company's Baby Powder and Shower to Shower powder.The court odered to pay $72 million to that woman.