అంతర్జాతీయ క్రికెట్‌కు జాన్సన్‌ వీడ్కోలు..

Johnson retired from International Cricket

07:05 PM ON 17th November, 2015 By Mirchi Vilas

Johnson retired from International Cricket

ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ మిచెల్‌ జాన్సన్‌(34) అన్ని ఫార్మాట్ల నుండి రిటైరవుతున్నట్టు ప్రకటించాడు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ జాన్సన్‌కి ఆఖరిది. జాన్సన్‌ బౌలర్‌ మాత్రమే కాదు ఆల్‌రౌండర్‌ కూడా. జాన్సన్‌ 2005 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్లో 2007 సంవత్సరంలో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో 73 మ్యాచ్‌లు ఆడి 313 వికెట్లు తీసిన నాలుగో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా జాన్సన్‌ రికార్డుల్లోకెక్కాడు. వన్డేల్లో 153 మ్యాచ్‌లు ఆడి 239 వికెట్లు తీశాడు. జాన్సన్‌ న్యూజిలాండ్‌తో ఆడుతున్న టెస్టు మ్యాచ్‌లో తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. రిటైర్మెంట్ ప్రకటించిన జాన్సన్‌కు సచిన్‌ టెండూల్కర్‌ శుభాభినందనలు తెలిపాడు.

English summary

Johnson retired from International Cricket