డ్రగ్స్ కి బానిసై ఒళ్లమ్ముకున్న నటి ఎవరో తెలిస్తే షాకే!

Josephine Gillan talks about her life

12:44 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

Josephine Gillan talks about her life

అవును మీరు విన్నది నిజమే! డ్రగ్స్ కి బానిసై ఆ మత్తులో తన ఒళ్ళునే అమ్ముకుంది. ఇంతకీ ఎవరా నటి? అనే ప్రశ్న మీలో మొదలయ్యి ఉంటుంది. ఆమె ఎవరో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. ప్రముఖ హాలీవుడ్ నటి జోసెఫ్ గిలాన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊహకందని సంచలన విషయాలను వెల్లడించింది. మత్తుపదార్థాలకు బానిసైన తాను.. వాటికోసం ఒళ్లు అమ్ముకున్నానని చెప్పింది. తన జీవితమంతా డ్రగ్స్, వ్యభిచారం, అశ్లీలమయం అని చెప్పింది. అయితే.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాత్రం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అమ్మడు వెల్లడించింది.

ఆ షోలో నటించడం వల్ల తనకు ప్రత్యేక గుర్తింపు దక్కడంతో పాటు ఓ మంచి జీవితం లభించిందని తెలియజేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ షోలో నటించడానికి ముందు నేను కొకైన్ కు బానిసను. దానిని కొనుగోలు చేయడం కోసం వారానికి మూడు లేదా నాలుగుసార్లు నా శరీరాన్ని అమ్ముకునేదాన్ని. చాలామందితో డేటింగ్ చేశాను. చాలావరకు పెద్దపెద్ద వారితోనే గడిపాను. వాళ్ళు నాకు ఒక రాత్రికి నాలుగువేల పౌండ్లు చెల్లించేవారు. వాటితో నేను జీవితాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చేది. కానీ.. ఆ డబ్బంతా డ్రగ్స్ కోసమే ఖర్చు చేశాను. జీవితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం డ్రగ్స్ మత్తులోనే లీనమైపోయాను.

కానీ.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ షోలో నటించే అవకాశం ఎప్పుడైతే లభించిందో అప్పటినుంచి నా జీవితం మారిపోయింది. ఆ షో ద్వారా నాకంటూ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆ షో నా జీవితాన్ని రక్షించింది అని ఇంటర్వ్యూలో జోసెఫ్ గిలాన్ చెప్పుకొచ్చింది. కాగా.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో నటిస్తున్న నటీనటులందరూ ఇలాంటి జీవితాన్ని గడిపినవాళ్ళే. ముఖ్యంగా.. ఇందులో ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న తారలందరూ గతంలో పోర్న్ స్టార్లు. మగవాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. అయితే.. ఈ షో వీరి జీవితాన్ని మార్చేసింది. అందరికీ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది అని చెప్పుకొచ్చింది.

English summary

Josephine Gillan talks about her life